సమాజ సేవ చేయాలనుంది.. ఉత్తమ మార్గం చెప్పండి గురూజీ!

శనివారం, 14 మార్చి 2015 (15:49 IST)
సమాజ సేవ చేయాలనుంది.. ఉత్తమ మార్గం చెప్పండి గురూజీ!.. ఒక యంత్రాన్ని మనం పనిచేయించాలనుకుంటే దానిలోని భాగాలన్నీ సక్రమంగా ఉంటేనే పని చేస్తుంది. మీ జీవనం కూడా అటువంటిదేనని, నీ చుట్టు నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా.. వాటి వలన నీవు ఇబ్బంది పడకుండా మనస్సుని ప్రశాంతంగానూ, ఆనందంగా వుంచగలిగితే మీరు ఇతరులకు సేవచేయగలుగుతారు. 
 
సమాజానికి సేవచేయడానికి ముందు మిమ్మల్ని మీరు గమనించుకోండి. ప్రశాంతతను, ఆనందాన్ని, మీరు అనుభవిస్తే మీరే సమాజానికి దొరికిన గొప్ప బహుమతి. తరువాత మీలోని గొప్పతానికి తగినట్లుగా మీ చుట్టూ వున్న వాళ్లకి కావలసిన వారికి సంతోషముగా సేవచేయడానికి పూనుకుంటారు.

వెబ్దునియా పై చదవండి