Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖానికి బొట్టు ఎంత ముఖ్యమైనదో తెలుసా..?

నుదుటన బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది హిందువులు సిగ్గు పడుతుంటారు. హిందూ ధర్మంలో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భ్రుకుటికి మధ్యలో ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితము అవుతాయని శాస్త్ర పరిశోధనలలో తేలింది కూడా. అలాగే ఎదుటివారు మన ముఖము చ

ముఖానికి బొట్టు ఎంత ముఖ్యమైనదో తెలుసా..?
, గురువారం, 20 ఏప్రియల్ 2017 (20:07 IST)
నుదుటన బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది హిందువులు సిగ్గు పడుతుంటారు. హిందూ ధర్మంలో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భ్రుకుటికి మధ్యలో ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితము అవుతాయని శాస్త్ర పరిశోధనలలో తేలింది కూడా. అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే ఈ కుంకుమ వల్ల దృష్టి దోషం కూడా ఉండదని చెపుతారు. అలాగే వివాహిత మహిళలకు సౌభాగ్య చిహ్నాలుగా మంగళ సూత్రం, నల్ల పూసలు, మెట్టెలు, పసుపు, కుంకుమ, పూవులను చెపుతారు. 
 
మంగళ సూత్రం, నల్లపూసలు ధరించిన స్త్రీని చూడగానే ఆమె వివాహిత అని అర్ధం అవుతుంది ఎవరికైనా. ఆమె మీద వెంటనే గౌరవభావం వస్తుంది. ఇకపోతే పసుపులో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయో కొత్తగా చెప్పక్కరలేదు. అలాగే మెట్టెలు ధరించడం వల్ల కూడా కొన్ని నాడులు సక్రమంగా పని చేస్తాయి. ఇవన్నీ శాస్త్రీయంగా నిరుపితమైన సత్యాలు. 
 
కానీ మనం ఏం చేస్తున్నాం...
అత్యంత ముఖ్యమైన తిలకాన్ని పెట్టుకోవడం మానేస్తున్నాం. ఫ్యాషన్ అంటూ నుదుటిన బొట్టు లేకుండానే బయటికి వెళ్ళిపోతున్నాం. మగవారైనా, ఆడవారైనా స్నానం చేసిన వెంటనే నుదుటిన బొట్టు పెట్టుకోవాలని శాస్త్రం. ఇది ఎవరు పట్టించుకోవటం లేదు. పూజ చేసుకునే ముందు కాళ్ళకు పసుపు రాసుకొని కూర్చోవాలి అంటుంది శాస్త్రం. బొట్టు లేకపోతే, ఇంకా పసుపుకు స్థానం ఎక్కడ? మహా అయితే పూజ లేదా నమస్కారం అయ్యే వరకు బొట్టు పెట్టుకొని ఇవతలకి రాగానే తుడిచేస్తున్నారు ఈకాలం అమ్మాయిలు. ఒకవేళ పెట్టుకున్నా కానీ కనపడకుండా చిన్న నల్ల రంగు బొట్టు పెట్టుకుంటున్నారు. నల్ల రంగు బొట్టు ఎప్పుడు పెట్టుకుంటారో వారికి ఎవరూ చెప్పటం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్షయం కాని ఫలితాలనిచ్చే అక్షయ తృతీయ.. బంగారమే కాదు ఏదైనా కొనవచ్చు..