Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతా భక్తి కార్తీకం (video)

Advertiesment
అంతా భక్తి కార్తీకం (video)
, సోమవారం, 22 నవంబరు 2021 (23:26 IST)
కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం అవుతున్నందునదీనికి కార్తీకమాసమని పేరొచ్చింది. కార్తీకంలోఎటు చూసినా దీపమే కనబడుతుంది. కార్తీకమాసంలో శివాలయంలో, విష్ణాలయంలో, అంబికాలయంలో, మఠప్రాంగణంలో ఇలా నాలుగు చోట్లా దీపాన్ని పెడతారు. ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు ఉంది.

 
పూజలో ఒక ప్రారంభంగా దీపం వెలిగిస్తాం. దీనికి ఒక పరమార్థముంది. పరమేశ్వరుడు అయిదు జ్ఞానేంద్రియాలనిచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. సమస్త సుఖాలు ఈ అయిదింటిపైనే ఆధారపడ్డాయి. బ్రహ్మాండంలో ఉన్న ఏ భోగస్థానమూ సుఖస్థానం కాదు. కార్తీక మాసంలో సూర్యుడు భూమండలానికి దూరంగా వెళతాడు.

 
రాత్రులు బాగా ఎక్కువవుతాయి. పగళ్ళు తక్కువవుతాయి. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తిశ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుడిని వేడుకుంటారు. కార్తీక సోమవారం మరీ ప్రశస్థమైనది. అందుకే ఆరోజుల్లో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. అంతా భక్తి కార్తీకం.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులు ఆందోళన వద్దు, ఈ నెలలో రాలేని భక్తులు వచ్చే నెల దర్శనం: ధర్మారెడ్డి