చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంధం "తిరుమందిరం"లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివరించారు. చిదంబరంలోని ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశమూ, వాయువూ, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ, కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి(భూమి)కి ప్రతీక అనీ అంటారు.
అయితే ఇక్కడ అద్భుతం ఏమిటంటే, ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. మానవుడికి నవ రంధ్రాలు ఉన్నట్లు ... చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు. ( 15 x 60x 24 = 21600). చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది.
చిదంబరం దేవాలయంలో "పొన్నాంబళం" కొంచెం ఎడమ వైపునకు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడకి వెళ్ళడానికి "పంచాక్షర పడి" ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది. "కనక సభ"లో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు. ఇవి 64X64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది.
అంతేకాదు అడ్డు దూలాలు రక్తప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు. పక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి ప్రతీకలు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.