Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబరు 1న భగినీ హస్త భోజనం... యుముడు ఇచ్చిన మాట... నిలబెట్టుకుంటాడట...

సోదరీసోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల

నవంబరు 1న భగినీ హస్త భోజనం... యుముడు ఇచ్చిన మాట... నిలబెట్టుకుంటాడట...
, మంగళవారం, 1 నవంబరు 2016 (14:28 IST)
సోదరీసోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. 
 
రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష(రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. "భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.
 
మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. 
 
ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోదావ‌రి జిల్లాల్లో... అత్తా లెక్క ఎక్కువయినా ఫర్లేదు... వందలో ఒక్కటి మిగిలినా ఓడినట్టే అల్లుడూ...