ఆత్మజ్ఞానం అంటే ఏమిటి...!
ఆత్మజ్ఞానం అంటే మరేమిటో కాదు.. మన గురించి మనం తెలుసుకోవడమే మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు నడిపించుకోవడమే. ఈ జ్ఞానం కలగటానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి. భగవంతుని రూపాలని మాత్రమే కాకుండా ఆయన చుట్ట
ఆత్మజ్ఞానం అంటే మరేమిటో కాదు.. మన గురించి మనం తెలుసుకోవడమే మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు నడిపించుకోవడమే. ఈ జ్ఞానం కలగటానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి. భగవంతుని రూపాలని మాత్రమే కాకుండా ఆయన చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యత్వాన్ని చూడాలి. ఆ దివ్యత్వంలో వెలవెల ఉపదేవాలు, సూక్తులు. మహిమలు, వలయల్లా పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిని మనం ఒడిసి పట్టుకోవాలి.
వాటిని నిత్య జీవితంలో ఆచరించాలి. ఏది మంచి? ఏది చెడు? ఏది ప్రగతికారం? ఏది ప్రతి బంధకం? అనేది తెలియాలంటే భగవంతుని ఉపదేశాలు మరీ ముఖ్యంగా వాటిలో నీతిని గ్రహించాలి. అప్పుడే మంచి నడవడికను నేర్చుకోగలుగుతాం. ఆదర్శనిలయమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాం. మనకు ఏది కావాలో? ఏది వద్దో? తెలుస్తుంది. మన లక్ష్యాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
అప్పుడే మానవజన్మకు సార్థకత. సాయి తన అవతార కాలమెంత ఎన్నో ఉపదేశాల్లోని సారాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యట్లేదు. మనిషి ఉన్నతిని సాధించటానికి సాయి చూపించిన మార్గం ఎంతో విశిష్టమైనది. పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ముఖ్యం కాదని, చేసే పనిని మనస్సు పెట్టి చేయడం కూడా భక్తి యోగానేనని, అదే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం కావాలని ఉపదేశించారు. వాటిని తెలుసుకుని ఆచరిస్తే మానవ జీవిత పరమార్థం నెరవేరుతుంది. సాయి ఒక సందర్భంలో నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్మాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి? ఏది చెడు? తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడే జ్ఞానం కలుగుతుంది అంటారు.