అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి
ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారిక
ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.