Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజలు ఎలాంటి సమయాల్లో చేయాలి

దేవతారాధన పూజలకు నిర్ధిష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు. ఈ కాలాల్లోనే ప్రశాంతమైన చిత్తంతో శుచిగా పర

Advertiesment
పూజలు ఎలాంటి సమయాల్లో చేయాలి
, శనివారం, 21 జనవరి 2017 (11:45 IST)
దేవతారాధన పూజలకు నిర్ధిష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు. ఈ కాలాల్లోనే ప్రశాంతమైన చిత్తంతో శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇదిలోనికి మళ్ళితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు. చివరకు 'యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్' అన్నట్లు ఏ పనిచేసినా పూజయన్న భావం స్థిరపడాలి. అట్లే జపం కూడా.
 
ప్రారంభంలో ఈ జపం మూల కూర్చుని, మాలపట్టుకుని జపం చేస్తూ చేస్తూ చివరకు మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానినే అజపాజపస్థితి అని పిలుస్తారు. అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని అహంకారాలు, కామనలు వంటివే. 
 
అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు. మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి పరమాత్మకు సమర్పించడం, పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్ళీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజలో భగవంతునికి భక్తులు అర్పించాల్సిన షోడశోపచారాలు