Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాళహస్తిలో ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాట... విద్యార్హత లేని ఉద్యోగికి ఏపీఆర్వో!

ప్రముఖ ముక్కంటి పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలలయంలో ఎలాంటి విద్యార్హతలతో పనిలేదు. ఎవరు ఏ పనైనా చేయవచ్చు. అధికారుల ఆశీస్సులు ఉంటే అసలు పనిచేయకపోయినా ఫర్వాలేదు. ఆలయంలో పరిచారకుడిగా ఉన్న ఒక ఉద్యోగి పని చే

Advertiesment
శ్రీకాళహస్తిలో ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాట... విద్యార్హత లేని ఉద్యోగికి ఏపీఆర్వో!
, సోమవారం, 19 డిశెంబరు 2016 (12:32 IST)
ప్రముఖ ముక్కంటి పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలలయంలో ఎలాంటి విద్యార్హతలతో పనిలేదు. ఎవరు ఏ పనైనా చేయవచ్చు. అధికారుల ఆశీస్సులు ఉంటే అసలు పనిచేయకపోయినా ఫర్వాలేదు. ఆలయంలో పరిచారకుడిగా ఉన్న ఒక ఉద్యోగి పని చేయకుండా దబాయించుకుని తిరుగుతుంటే ఆయన్ను దారిలో పెట్టేబదులు ఏపిఆర్ ఓ పేరుతో ఆఫీసులో పెట్టి పని ఎగ్గొట్టడానికి మరింత అవకాశం కల్పించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
 
సాధారణంగా పరిచారకులు తెల్లవారుజామున 5 గంటలకే ఆలయానికి రావాలి. పూజాది కార్యక్రమాల్లో అర్చకులకు సహకరించాలి. అభిషేకానికి జలం తీసుకురావడం, పూజాద్రవ్యాలు అందించడం వంటి పనులు చేయాలి. ఈ పరిచారకుడు మాత్రం ఏనాడూ పరిచారకుడిలా పనిచేసిన దాఖలాలు లేవు. అభిషేకానికి బిందె నీళ్ళు మోయంగా చూసిన దాఖలాలు లేవు. ఎప్పుడో ఉదయం తొమ్మిదో పదికో ఆలయానికి వస్తారు. అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు గడిపేసి ఆ మాటా ఈమాట చెప్పేసి ఇంటిముఖం పడతారన్న ఆరోపణలు లేకపోలేదు.
 
గతంలోనూ ఇలాగే తిరుగుతున్న ఈయన గారిని విజయ్‌కుమార్‌ ఈఓగా ఉన్నప్పుడు నడుముకు గుడ్డ కట్టించి తీర్థం పోయించారు. ఆ మధ్య బోర్డు లేని కాలంలోనూ తీర్థం పోసేవారు. బ్రమరాంభ ఈఓగా వచ్చాక మళ్ళీ మొదటికి వచ్చారు. పనీపాట లేకుండా కాలం గడిపేశారన్న విమర్శలు లేకపోలేదు. పరిచారక పనులు చేయాల్సిన ఆ ఉద్యోగికి తాజాగా ఎపిఆర్ ఓ ఉద్యోగం అప్పగించారు. అలా అప్పగించడానికి ఆయనకున్న అర్హతలేమిటో తెలియదు. ఎపిఆర్‌ ఓ అంటే ఆలయానికి వచ్చే భక్తులతో సంబంధాలు నెరపాలి. ఆలయంలో జరిగే కార్యక్రమాలపై పత్రికలకు, టీవీ ఛానళ్లకు సమాచారం పంపాలి. ప్రెస్‌నోట్‌ ఇవ్వాలి. ఎపిఆర్‌ఓకు కనీసం ప్రెస్‌ నోట్‌ రాయడం తెలుసుండాలి. శ్రీకాళహస్తి పిఆర్ ఓ విభాగం నుంచి ప్రెస్‌నోట్‌ వచ్చిన సందర్భం లేదు. హుండీ లెక్కింపు రోజు నాలుగు వ్యాక్యాలు వాట్సాప్‌లో పెట్టడంతోనే పని అయిపోయిందని అనుకుంటుంటారు.
 
అన్ని తెలిసిన వారికే పదవి ఇవ్వకుండా విద్యార్హతతో పనిలేకుండా ఇలాంటి పోస్టులు సృష్టించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక పోస్టు కాదు. ఎన్నో పోస్టు పరిస్థితి ఇలానే ఉన్నాయి శ్రీకాళహస్తి. ఈ విషయంపై శ్రీకాళహస్తి ఈఓ బ్రమరాంభ స్పందించాలని పలువురు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే పాలకమండలిలో ఎవరుండాలి..... భక్తులు అర్హులు కాదా?