నవరాత్రుల సందర్భంగా ఇంట బొమ్మల కొలువును వుంచితే మంచి ఫలితాలు వుంటాయని, సౌభాగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇంకా ముగ్గురమ్మల అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రి పూజను హస్త, చిత్త లేదా మూల నక్షత్ర రోజులలో ప్రారంభించడం మంచిది. ఈ రోజుల్లో వైధృతి యోగానికి సమయం కేటాయించడం చాలా మంచిది.
నవరాత్రి పూజలు చేయడం వల్ల సుకన్యా దేవి అన్ని రకాల ప్రయోజనాలను పొందినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే విజయ దశమి రోజున శ్రీ ఆయుర్దేవిని పూజించాలి. ఇది నవరాత్రి పూజను ముగింపు పలికినట్లవుతుంది. నవరాత్రి రోజుల్లో పగలు శివపూజ, రాత్రి అమ్మవారి పూజ నిర్వహిస్తారు.
నవరాత్రులలో 9 రోజులు ప్రతిరోజూ 1008 శివ నామాలను ప్రార్థించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి. ప్రతిరోజూ నవరాత్రి పూజలు ప్రారంభించేటప్పుడు శ్యవన మహర్షి, సుకన్య దేవిని ధ్యానిస్తూ రోజువారీ పూజను ప్రారంభించాలని ఆధ్యాత్మిక పండితులు సెలివిస్తున్నారు.