Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ వృద్ధురాలి కోసం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఏం చేశారో తెలుసా...?!

సాధారణంగా ఎవరైనా ఒకసారి మంచి పేరు వస్తే ఆ తరువాత వెనక్కి తిరిగి చూడరు. హెడ్ వెయిట్ వచ్చేస్తుందంటారు. అది మామూలే. చాలామంది ప్రముఖులు ఇదేవిధంగా వ్యవహరిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అలా కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది కొంతమంది భావన. బాగా పే

Advertiesment
ఓ వృద్ధురాలి కోసం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఏం చేశారో తెలుసా...?!
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (19:00 IST)
సాధారణంగా ఎవరైనా ఒకసారి మంచి పేరు వస్తే ఆ తరువాత వెనక్కి తిరిగి చూడరు. హెడ్ వెయిట్ వచ్చేస్తుందంటారు. అది మామూలే. చాలామంది ప్రముఖులు ఇదేవిధంగా వ్యవహరిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అలా కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది కొంతమంది భావన. బాగా పేరు వచ్చి ప్రపంచప్రఖ్యాతి పొందిన తర్వాత ఒకసారి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు.
 
గేటు బయట ఒక వృద్ధురాలు సుబ్బులక్ష్మిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మి విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు. ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ఆమె మీ కచేరి చూద్దామని 10 మైళ్ళ నుండి నడుచుకొనివచ్చాను. నా దురదృష్టంకొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు అంది. 
 
సుబ్బులక్ష్మి ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా సుబ్బులక్ష్మి ఆ ముసలావిడ ఒక్కదాని కోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు. ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి జీవితమే ఒక ఉదాహరణ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే దరిద్రం పట్టుకుంటుందా?