Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీల మంగళసూత్రాల తాడులో పిన్నీసులు ఉంచితే...

పురాతనకాలం నుంచి మన పెద్దలు, పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు, పద్దతులు, విశ్వాసాల గురించి చాలా మందికి తెలుసు. అయితే కొందరు వాటిని మూఢనమ్మకాలను కొట్టిపారేస్తారు. కానీ వాస్తవానికి చెప్పాలంట

స్త్రీల మంగళసూత్రాల తాడులో పిన్నీసులు ఉంచితే...
, సోమవారం, 12 జూన్ 2017 (14:32 IST)
పురాతనకాలం నుంచి మన పెద్దలు, పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు, పద్దతులు, విశ్వాసాల గురించి చాలా మందికి తెలుసు. అయితే కొందరు వాటిని మూఢనమ్మకాలను కొట్టిపారేస్తారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే వాటిని పాటిస్తే మనం కోల్పోయేదేమీ ఉండదట. ఒకవేళ నిజంగానే జరిగితే మనకు మంచిదేగా. దీంతో ఆ నమ్మకం గురించి మనం ఇతరులకు చెబుతాం. అయితే అలాంటి నమ్మకాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు మంగళసూత్రాల్లో పిన్నీసులు ఉంచరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మంగళసూత్రం వేదమంత్రాలతో ప్రభావం కాబడిన భర్త ఆయువు పట్టు. 
 
మంగళసూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది. ఇనుముతో చేసినవి దివ్యశక్తులను ఆకర్షించే గుణాలను కలిగి ఉంటుంది. పిన్నీసు కారణంగా దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడ్ని చేస్తాయి. దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుంది. అంతే కాదు భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగం కూడా తగ్గుతుందట. కాబట్టి ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. అంతే కాదు స్త్రీలు మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాకుండా వీటి శబ్థం శుభాలను, అనురాగాలను పెంచుతుందట. ఇంట్లో గుర్రం బొమ్మలను కూడా ఉంచకూడదట. దీని కారణంగా డబ్బు విపరీతంగా ఖర్చవుతుందట. వచ్చినా నిలవదని పురాణాలు చెబుతున్నాయి. 
 
అంతేకాదు.. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మీ భార్య కుడి చేతిని తాకి వెళితే మీకు అంతా శుభమేనట. అంటే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవడం.. సంపద రావడం జరుగుతుందట. ఇలా జరుగుతుందని పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారికి మినహాయింపు లేదు.. ఆయన కూడా పన్ను చెల్లించాల్సిందే : అరుణ్ జైట్లీ