Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం నాడు మహాలయ అమావాస్య... ఏం చేయాలి?

నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్యను “మహాలయ అమావాస్య” అంటారు. భాద్రపద మాసంలో పౌర్ణమితో ప్రారంభమయిన పితృపక్షం అదే మాసం చివరి రోజుల్లోని అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యనే మహాలయ అమవాస్యగా పరిగణిస్తారు. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. ప

Advertiesment
Mahalaya amavasya pooja
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (17:49 IST)
నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్యను “మహాలయ అమావాస్య” అంటారు. భాద్రపద మాసంలో పౌర్ణమితో ప్రారంభమయిన పితృపక్షం అదే మాసం చివరి రోజుల్లోని అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యనే మహాలయ అమవాస్యగా పరిగణిస్తారు. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. పితృపక్షంలో పితృదేవతలు భగవాన్‌ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమిపైకి వస్తారు. వీరిని సంతృప్తి చేసేందుకు మనం తర్పణం వదలాలి. కేవలం తర్పణమే కాదు అన్నదానం కూడా చేయాలి. 
 
కనీసం ఒక్క పేదవానికయినా అన్నదానం చేయాలని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. అన్నదానం కేవలం మానవులకే కాకుండా జంతు జాలానికి కూడా పెట్టాల్సి వుంటుంది. కాకి, ఆవు... తదితర వాటికి ఆహారం సమర్పించాలి. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం మనకు అన్ని విధాలుగా శుభాలను చేకూర్చుతుంది. మన నేటి జీవితానికి పలువిధాలుగా దోహదపడ్డ మునుపటి తరాల పట్ల కృతజ్ఞతా భావాన్నివెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితం చేయబడ్డ ప్రత్యేక దినం ఇది. 
 
ఈ పక్షం అంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజు చేసి తీరాలి. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణ వశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన అక్టోబరు 2016, 863 ఏళ్ల తర్వాత అరుదైన నెల... ఏంటి విశేషం?