Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రివేళ స్నానం మహాపాపం.. పగటివేళ స్త్రీ పురుషుల కలయిక పనికిరాదు..

మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు అనేక హితోపదేశాలు చేశారు. అలాగే, శుభాశుభాల గురించి వివరించారు. అలా చెప్పిన హితవచనాల్లో అనేకం ఉన్నాయి. వాటిలో రాత్రి వేళ స్నానం చేయడం కలిగే శుభాశుభాల గురించి తెలుపుతూ...

రాత్రివేళ స్నానం మహాపాపం.. పగటివేళ స్త్రీ పురుషుల కలయిక పనికిరాదు..
, సోమవారం, 13 మార్చి 2017 (15:25 IST)
మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు అనేక హితోపదేశాలు చేశారు. అలాగే, శుభాశుభాల గురించి వివరించారు. అలా చెప్పిన హితవచనాల్లో అనేకం ఉన్నాయి. వాటిలో రాత్రి వేళ స్నానం చేయడం కలిగే శుభాశుభాల గురించి తెలుపుతూ... 
 
ధర్మరాజా! రాత్రివేళ స్నానం మహాపాపం. చేయకూడదు. పొద్దున స్నానం చేసిన తర్వాత శరీరాన్ని ఎక్కువగా తుడుచుకోరాదు. తుడుచుకుంటే శుచిత్వం తొలగిపోతుందంటారు. స్నానానికి ముందు శరీరానికి సుగంధాలు పూసుకోరాదు. తడిబట్ట గట్టిగా పిండనిదే జాడించరాదు. ఇతరులు కట్టి విడిచిన వస్త్రాన్ని ధరించరాదు. 
 
పగటివేళ స్త్రీ పురుషుల కలయిక (రతి) పనికిరాదు. ఉమ్మివేసినప్పుడుగాని, తుమ్మినప్పుడుగాని ఆచమనం చేసి తీరాలి. ఒకవేళ ఆచమనానికి అవకాశం లేని పక్షంలో ప్రణవోచ్చరణ చేస్తూ సూర్యుని వైపు చూసి, కుడిచెవిని పట్టుకోవాలి.
 
ఇతరులు వాసన చూసిన ఆహార పదార్థాలను కూడా తినకూడదు. మనసును ఎక్కడో పెట్టుకుని, భోంచెయ్యకూడదు. తింటోన్న ఆహారాన్ని నిందించకూడదు. ఉప్పును చేతితో తీసి నోట్లో పెట్టుకున్నా, రాతి మీది ఉప్పు తీసుకున్నా, రాత్రివేళ పెరుగన్నం తిన్నా, తీయని పదార్థాలు స్వీకరించినా, పేలపిండి తిన్నా మహాపాపం అని పెద్దలంటారు. 
 
ఇతురులు చూసిన ఆహారపదార్ధాలను వారికి ఇవ్వకుండా తినరాదు. పంక్తిలో అందరికీ ఒకేలా వడ్డించాలి. హెచ్చుతగ్గులుగా వడ్డించడం కూడదు. అలా వడ్డిస్తే అది విషంతో సమానం అంటారు. నేయి, తేనె, పేలపిండి, పెరుగు, పాయసం, మంచినీరు ఒకరికి ఇవ్వగా, వారు తిన్న తర్వాత ఇంకా మిగిలితే, ఆ మిగిలిన దాన్ని వేరొకరికి ఈయరాదు. ఇస్తే ఆయుర్దాయం తప్పకుండా క్షీణిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం హోలీ... రంగులు చల్లుకునేటప్పుడు....