Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేంకటేశ్వరస్వామి వారికి మొదటి నైవేద్యం ఎందులోనో మీకు తెలుసా...?

ఇదివరకు తిరుమలలో తొండమాన్‌ చక్రవర్తి స్వామివారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్‌ చక్రవర్తి రోజూ స్వామివారి దగ్గరికి వెళ్ళి చె

Advertiesment
lord venkateswara naivedyam
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (13:13 IST)
ఇదివరకు తిరుమలలో తొండమాన్‌ చక్రవర్తి స్వామివారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్‌ చక్రవర్తి రోజూ స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవాడట. స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నారు. పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడట. స్వామి తొండమానుడికి ఒక పాఠం చెప్పాలని నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్ళి చూడు అన్నారట స్వామి.
 
మరుసటి రోజు వెళదాం అని అనుకుని స్వామివారు చెప్పారట ఈ మట్టి దళాలు ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడట. మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలని బయలుదేరాడట. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అప్పటికే నడిచినడిచి భీముడి ఇంటి దగ్గరలో సృహ తప్పి పడిపోయాడట. అప్పుడు ఆ భీముడే తొండమాన్‌ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకెళ్ళాడట. తొండమాన్‌ చక్రవర్తి అడిగాడట. ఒరేయ్‌ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు. వేంకటేశ్వరస్వామివారికి నువ్వంటే చాలా ఇష్టం అని.
 
భీముడు అన్నాడు.. నేనేం చేస్తాను స్వామి కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు. కుండలు చేసుకునే శక్తిని ఇచ్చావు. అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేశావు. వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసిదళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వరస్వామివారిమూర్తికి సమర్పించేవాడట. ఏ పని మొదలుపెట్టినా గోవింద నేను చేయడమేమిటి. నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవాడట. అప్పుడు తొండమాన్‌ చక్రవర్తి అనుకున్నారట. వీడేమో అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు. నేనేమో నేను చేస్తున్నారు అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరం చేసే పెద్ద తప్పిందం.
 
భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామివారికి సమర్పించి తను తినేవాడట. స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై దివ్య విమానంలోంచి దిగి భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యాడట. వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకుని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటిమీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెడలో వేశారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలన్నీ భీముడి భార్యకి తొడిగారట. స్వామివారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారట. ఇప్పటికే స్వామివారి ఆనందనిలయంలో మొదటి గడప దాటి నైవేధ్య కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతిరోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటి మాత్రమే స్వామి తింటారని పురాణాలు చెబుతున్నాయి. దీని సారాంశం ఏంటంటే ఎక్కడ భక్తి ఉందో అక్కడ స్వామివారు వశుడై పోతాడట. ఎక్కడ గర్వం, అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేశుని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?