Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమలపాకులు, సుపరిమళ పూలతో పూజిస్తే హనుమంతునికి ఇష్టమెందుకంటే....

హనుమంతుడిని గురువారం మల్లెపూలతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా హనుమాన్‌కు మల్లెపూల మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి, శుభకార్యాలు వంటివి చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న

తమలపాకులు, సుపరిమళ పూలతో పూజిస్తే హనుమంతునికి ఇష్టమెందుకంటే....
, శనివారం, 24 సెప్టెంబరు 2016 (21:49 IST)
హనుమంతుడిని గురువారం మల్లెపూలతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా హనుమాన్‌కు మల్లెపూల మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి, శుభకార్యాలు వంటివి చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. 
 
అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేశారట. అందుకే హనుమంతునికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. 
 
ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు. అలాగే తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది కనకు హనుమంతునికి కూడా ఇష్టమైనది. కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పువ్వులు. కేరళలోని ఇరింజలకుడ అనే ప్రాంతంలో భరతునికి ఆ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కలువ పూల మాల వెయ్యడం సంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారని పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేటర్‌ యజమాని వ్యవహారంలా మారిన తితిదే పెద్దల వ్యవహారశైలి.. కాసులుంటేనే శ్రీవారి దర్శనం!