కుబేరుడిని ధనానికి రాజు అంటారు. భూమి మీద ఉన్న ధనమంతటికీ కుబేరుడే రాజుగా చెబుతుంటారు. నిజానికి ధన ప్రాప్తికి ఎన్నో మంత్రాలున్నాయి. కానీ ధనప్రాప్తికి ఈ మంత్రం ఎంతో ముఖ్యం.
ఈ మంత్రంతో లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవచ్చన్నది విశ్వాసం. ఓం యక్షాయ కుబేరాయా వైశ్వనాయ ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి మి దేహీ దాపయా స్వాహా. అనే మంత్రాన్ని జపించాలి. పొద్దున్నే లేచాక మీ పనులన్నింటిని ముగించుకుని తలస్నానం చేసి చెక్క పీఠం మీద లక్ష్మీదేవి, కుబేరుడు ఉన్న పటం పెట్టాలి. అది ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే ఒక నెయ్యి ఒత్తిని వెలిగించి ధూపం వెయ్యాలి. పూజ చేస్తూ గణపతి దేవుడిని ప్రార్థించాలి. 108 సార్లు ఇలా మంత్రాన్ని ఆసనంలో కూర్చుని జపించాలి. ఇలా చేస్తే కుబేరుడు ధనప్రాప్తి ఇస్తాడని విశ్వాసం. అలాగే చెక్క పీఠం మీద ఏడు గవ్వలను పెట్టి పూజిస్తే ఇంకా త్వరగా ధనప్రాప్తి లభిస్తుందని విశ్వాసం.