కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే పంచమి తిథిలో వారాహి దేవిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
అలాగే కార్తీక మాసం సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. నదీస్నానాలు కార్తీక మాసంలో పవిత్రమైనవి.
కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. పగలంతా ఉపవాసం వుండాలి. నమకచమకం చదవాలి. శ్రీసూక్తం పఠించావి, మహాదేవునికి రుద్రాభిషేకం చేయించాలి. తులసీ కోట ముందు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి.
కార్తీక మాసంలో ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. అయితే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోకూడదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలు తొలగిపోతాయి.