Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలియుగం: కలి నుంచి తప్పించుకోవాలంటే.. ఒక్కటే మార్గం

కలియుగం: కలి నుంచి తప్పించుకోవాలంటే.. ఒక్కటే మార్గం
, బుధవారం, 13 సెప్టెంబరు 2023 (23:06 IST)
కలియుగం అంటే వెంటనే విధ్వంసంపై దృష్టి మళ్లుతుంది. కలియుగంలో నాశనం తప్పదంటారు. ప్రతి యుగంలో యుద్ధం అనేది తప్పదు. అదీ కలియుగంలో ప్రతిరోజూ యుద్ధమే. ఇతర యుగాల సంగతికి వెళ్తే.. యుగాంతంలో యుద్ధాలు జరుగుతాయి. 
 
కానీ కలి ప్రభావంతో మానవులు ప్రతి రోజూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ప్రతి విషయానికి మానవుడు పోరాటం చేయాల్సి వుంటుంది. ఇతర యుగాల్లో దేవతలకు అసురులకు యుద్ధం జరిగితే, కలియుగంలో మనల్ని మనం పోగొట్టుకుంటున్నాం. 
 
కలియుగంలో కష్టపడిన వారికి ఫలితం తక్కువ. కష్టపడని వారికి ఫలితం ఎక్కువ. శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు. మనుషులలో నీతి నిజాయితీ ఉండదు. దాన ధర్మాలు ఉండవు. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గిపోతూ వుంటాయి. చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతం వచ్చి కరువులు, వరదలు, యుద్ధాలు, ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది. కలి పురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు.
 
అయితే కలి ప్రభావం నుంచి తప్పించుకునే మార్గం ఒక్కటుంది. మనస్ఫూర్తిగా రోజుకు ఒక్కసారైనా దైవ స్మరణ చేసిన చాలు. కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం. దాన ధర్మాలు చేయడం. పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చిపోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం. కాశీకి వెళ్లినట్టు మనసులో స్మరించుకుంటే కలి పురుషునికి దూరంగా ఉండవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరాం, జయరాం, జయ జయరాం.. అంటే చాలు.. హనుమ..?