Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'భార్య విబ్యాతి తాస్మిన్ కయె'... చనిపోతే అతిగా ప్రేమించే భార్య కూడా...

ఇవాళ మీరు ఇక్కడున్నారు. ఇక్కడ అంతా వాస్తవం. మీరు, మీ భార్య, మీ బిడ్డ, మీ ఆస్తి, మీ వ్యాపకం, మీ భావాలు, మీ అహం ఇవన్నీ చాలా వాస్తవం. రేపు ఉదయం మీరు మరణిస్తే అదంతా ఏమవుతుంది? అదంతా ఎక్కడికి పోతుంది? మీ శ

Advertiesment
Jaggi Vasudev‬
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (17:24 IST)
ఇవాళ మీరు ఇక్కడున్నారు. ఇక్కడ అంతా వాస్తవం. మీరు, మీ భార్య, మీ బిడ్డ, మీ ఆస్తి, మీ వ్యాపకం, మీ భావాలు, మీ అహం ఇవన్నీ చాలా వాస్తవం. రేపు ఉదయం మీరు మరణిస్తే అదంతా ఏమవుతుంది? అదంతా ఎక్కడికి పోతుంది? మీ శరీరం పనికిరానిది. మీరు మరణించాక, మీ శరీరం ఎవరికీ అక్కరలేదు. అవును మీ కుటుంబంలో అమితంగా ప్రేమించబడినవారు ఎవరైనా మరణిస్తే ఆ శవాన్ని మీ పడక గదిలో ఉండనిస్తారా? శంకరుడు చెప్పినట్లు 'భార్య విబ్యాతి తాస్మిన్ కయె'. దాని అర్థం రేపు మీరు చనిపోతే మిమ్మల్ని అతిగా ప్రేమించిన వ్యక్తి లేదా మిమ్మల్ని బాగా ప్రేమించిన మీ భార్య కూడా - ఆమె ప్రేమించింది మీ శరీరాన్నే. 
 
మీరు మరో శరీరంతో వస్తే ఆమె మిమ్మల్ని ప్రేమించదు. ఇది శరీరం మాత్రమే. అందువల్ల దానితో అనుబంధం పెంచుకోవద్దు. మిమ్మల్ని ఈరోజు ప్రేమించిన వ్యక్తి రేపు ఉదయం మీరు మరణిస్తే మీ శరీరాన్ని వారి వద్ద ఉంచుకుంటారా? అలా ఉంచుకుని సంతోషంగా ఉంటారా? శవం అంటే భయపడిపోయి దాన్ని వదిలించుకుందామని అనుకుంటారు. అవునా కాదా? మిమ్మల్ని ఇక్కడ పూడ్చిపెడితే మీరు మట్టిలో కలిసిపోతారని మీకూ తెలుసు. మిమ్మల్ని దహనం చేసినా దాని ఫలితం ఏమిటో మీరు వెంటనే చూస్తారు. 
 
మరి నువ్వు ఏమయ్యావు. ఈ విషయం పరిశీలించాలి. నిశ్చయంగా చూడవలసిందే ఏమంటారు? ఎందుకంటే ఈరోజు ఇక్కడున్న మనిషి ఎంతో వాస్తవమైన సంగతి మరునాడు హఠాత్తుగా గాలిలో కలిసిపోయి అదృశ్యమయితే అది తెలుసుకోవలసిన పని మీదే. ఎందుకంటే రేపు మీ విషయంలోనూ అలా జరుగబోతున్నది. నిశ్చయంగా ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. అవును కదా... అందుకే ఇది తొలిమెట్టు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవిత్రమైన పూజ విధానానికి కొన్ని టిప్ప్...