Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అష్ట‌... అష్టాద‌శ... 8కి, 18కి ఎంత ప్రాధాన్య‌మున్నదో తెలుసుకోండి...

అష్ట అంటే ఎనిమిది... అష్టాద‌శ అంటే 18. ఈ 8 అంకెకు, 18 అంకెకూ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది... మ‌నం పూజించే ల‌క్ష్ములు ఎనిమిదుగురు... అందుకే అష్ట ల‌క్ష్మి అంటారు. అష్టలక్ష్మి: ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి,

Advertiesment
అష్ట‌... అష్టాద‌శ... 8కి, 18కి ఎంత ప్రాధాన్య‌మున్నదో తెలుసుకోండి...
, సోమవారం, 30 జనవరి 2017 (20:01 IST)
అష్ట అంటే ఎనిమిది... అష్టాద‌శ అంటే 18. ఈ 8 అంకెకు, 18 అంకెకూ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది... మ‌నం పూజించే ల‌క్ష్ములు ఎనిమిదుగురు... అందుకే  అష్ట ల‌క్ష్మి అంటారు. అష్టలక్ష్మి: ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.
 
అష్టాదశ పీఠాలు:
1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
 
అష్టాదశ పురాణాలు:
1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం
 
అయ్యప్ప స్వామి గుడి మెట్లు 18
1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల
 
అష్ట దిక్పాలకులు
1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)
 
అష్ట మూర్తులు
1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.
 
అష్ట ఐశ్వర్యాలు
1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్ర సంతానం
8. దాసిజన పరివారం
 
అష్ట కష్టాలు
1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్ర్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం
 
అష్ట ఆవరణాలు
1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రం
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదం
 
అష్ట విధ వివాహములు
1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం
 
అష్ట భోగాలు
1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం
 
అష్టాంగ యోగములు
1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ధ్యానము
8. సమాధి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకు నరకభయం తొలగాలా.. అయితే ఇది చేయండి...!