Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలకు మొదటిసారి నడవాలి అనుకునేవారు ఇలా చేయాలట...!

అనుకున్న కోర్కెలు తీరాలని ఎంతోమంది భక్తులు శ్రీవారిని కోరుకుంటుంటారు. కొంతమందైతే మొదటిసారి కోరుకునే అప్పుడే తిరుమలకు వెళ్ళాలనుకుంటారు. సాధారణంగా చాలామందికి వాకింగ్ అలవాటు ఉండదు.

Advertiesment
tirupati
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (13:20 IST)
అనుకున్న కోర్కెలు తీరాలని ఎంతోమంది భక్తులు శ్రీవారిని కోరుకుంటుంటారు. కొంతమందైతే మొదటిసారి కోరుకునే అప్పుడే తిరుమలకు వెళ్ళాలనుకుంటారు. సాధారణంగా చాలామందికి వాకింగ్ అలవాటు ఉండదు. వాకింగ్ అలవాటు ఉంటే ఈజీగా తిరుమల మెట్లను ఎక్కేయవచ్చంటున్నారు వైద్యులు. కానీ అందులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. తప్పనసరిగా జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చట. అదేంటో మీరు చూడండి.
 
నెమ్మదిగా నడవండి.. పరుగెత్తవద్దు. పరుగెత్తితే తొందరగా అలసిపోతారు. సాధ్యమైంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు. కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటిగంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళతారు. ఇక అక్కడి నుంచి మోకాళ్ళ మంటపం వరకు మెట్లు ఉండవు. ఉన్నా ఒకటీ అరా ఉంటాయి. మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్ళలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంత వరకు గ్లూకోసు, నీళ్ళు వీటిపై ఆధారపడాలని వైద్యులు సూచన చేస్తున్నారు. 
 
ముఖ్యంగా కూల్ డ్రిండకులు ఏ విధంగానూ మన నడకకు సహకరించవు. నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రసీదు తీసుకోవడం మరిచికూడదు. ఆ తర్వాత కొంతదూరం నడిచాక మళ్ళీ ఆ రసీదు మీద ముద్ర వేయించుకోవడం అసలు మరిచిపోకూడదు. లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. లగేజీని దేవస్థానానికి చెందిన ఉచిత రవాణా సేవలోపైకి పంపించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లింగోద్భవ కాలం అంటే ఏమిటి? ఆ సమయంలో శివుడిని అభిషేకిస్తే కలిగే ఫలితమేమిటి?