హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు..? ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే?
మహా విష్ణువు అలంకారప్రియుడు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అలాగే హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. ''శ్రీరామ జయరామ... జయ జయ రామ'' అనే స్తోత్రం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ప్రసన్నమవుతాడు. రోజూ ''శ్రీర
మహా విష్ణువు అలంకారప్రియుడు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అలాగే హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. ''శ్రీరామ జయరామ... జయ జయ రామ'' అనే స్తోత్రం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ప్రసన్నమవుతాడు. రోజూ ''శ్రీరామ జయరామ... జయ జయ రామ'' అనే స్తోత్రాన్ని 21 సార్లు ఉచ్చరించడం ద్వారా హనుమంతుడి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
ఇంకా పంచముఖ హనుమంతుడిని పూజించడం ద్వారా.. ఇంట్లో ఐక్యత నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. రోగాలు దరిచేరవు. జ్యోతి స్వరూపమైన హనుమంతుడిని స్తుతించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే హనుమాన్‌ను పూజించడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక కష్టాలుండవు. ఆంజనేయుడిని పూజించేందుకు మంగళ, శనివారాలు ఉత్తమం. ఈ రెండు రోజుల్లో హనుమంతుని ఆలయాల్లో హనుమాన్ చాలీసా లేదా రామ చరితం పఠించాలి. లేకుంటే హనుమాన్‌కు ప్రీతిపాత్రమైన రామ నామ పారాయణం చెయ్యొచ్చు.
తమలపాకుల మాల ఎందుకు ?
అశోక వనంలో సీతమ్మను చూసేందుకు రామ దూతగా హనుమంతుడు వెళ్తాడు. అక్కడ సీతమ్మను చూసిన తర్వాత తిరిగి ప్రయాణమవుతుండగా, హనుమంతుడికి సీతాదేవి తన చుట్టూ వున్న తమలపాకుతో మాల కట్టి.. హనుమంతుని శిరస్సుకు ధరింపజేస్తుంది. ఆపై ఆశీర్వదించి పంపతుంది. తద్వారానే హనుమంతుడికి తమలపాకుతో కూడిన మాల ధరింపచేస్తారు. అందుకే రావణునితో యుద్ధంలో గెలు సాధ్యమైంది.