Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చింత చెట్ల మీద దెయ్యాలు ఉంటాయా? మిట్ట మధ్యాహ్నం వెళ్తే ఏం చేస్తాయ్!

దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? భూతాలు ఉన్నాయని విశ్వసిస్తారా? పోనీ ఎప్పుడైనా దెయ్యాన్ని కళ్లారా చూశారా? దెయ్యాలు, భూతాలు ఏంటి బాస్, అంతా ట్రాష్ అంటారా! నిజానికి ఈ లోకంలో దెయ్యాలున్నాయని కొందరు, లేవని మర

Advertiesment
Ghosts
, శనివారం, 9 జులై 2016 (14:57 IST)
దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? భూతాలు ఉన్నాయని విశ్వసిస్తారా? పోనీ ఎప్పుడైనా దెయ్యాన్ని కళ్లారా చూశారా? దెయ్యాలు, భూతాలు ఏంటి బాస్, అంతా ట్రాష్ అంటారా! నిజానికి ఈ లోకంలో దెయ్యాలున్నాయని కొందరు, లేవని మరికొందరు అంటుంటారు. దెయ్యాలు ఉన్నాయో లేవో అన్నది వారి నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దెయ్యాలున్నాయన్న వాదన కొస్తే... అసలు దెయ్యాలు ఎక్కడ వుంటాయి అనేది ప్రతి యొక్కరి మదిలో మెదిలే ప్రశ్న. ఆ దెయ్యాలు ఎక్కడెక్కడ వుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పాతబడిన బంగ్లాలో జనసంచారం లేని చోట్లలో దెయ్యాలు ఉంటాయట. నిజానికి అలాంటి బంగ్లాలు చూడ్డానికి కూడా భయంకరంగానే ఉంటాయి. పూర్వం చింత చెట్ల మీద దెయ్యాలు తిష్ట వేస్తాయని పెద్దలు అంటారు. మరీ ముఖ్యంగా వేసవిలో చింత చెట్ల మీద దెయ్యాలు వుంటాయని, అందుకే మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి వేళల్లో అటు వైపు వెళ్లవద్దని అప్పట్లో మన పెద్దలు హెచ్చరించేవారు.
 
మర్రి చెట్లు ఊడలలో దెయ్యాలు విరివిగా కనిపిస్తాయట. అందుకే మర్రి చెట్లు మనకి ఊరి చివర కనిపిస్తుంటాయి. మర్రి ఊడలు కూడా చీకట్లో దెయ్యాల్లాగా ఉంటాయి. మనిషి చనిపోయాక చేరుకునేది స్మశానమే కదా. కాబట్టి స్మశానంలో దెయ్యాలుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటిదృష్టికి అరటిచెట్టుకు లింకుందా? అరటి చెట్టు ప్రతి సెకనుకు చిగురిస్తుందట!!