Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాకి తలపై తన్నితే అశుభమా? మరి కాకి అరిస్తే శుభవార్త వస్తుందా?

శరీర రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంది ఉంటారు. అదే గట్టిగా గోలచేస్తూ అరిస్తే కాకిలా అరుస్తున్నావు ఎందుకు అని మందలిస్తారు. అలాగే కాకి తలపై తన్నితే దోషమని చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు.

కాకి తలపై తన్నితే అశుభమా? మరి కాకి అరిస్తే శుభవార్త వస్తుందా?
, గురువారం, 18 ఆగస్టు 2016 (09:17 IST)
శరీర రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంది ఉంటారు. అదే గట్టిగా గోలచేస్తూ అరిస్తే కాకిలా అరుస్తున్నావు ఎందుకు అని మందలిస్తారు. అలాగే కాకి తలపై తన్నితే దోషమని చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు. మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధి కూడా పిలుస్తారు. ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలా మంది నమ్ముతారు. కానీ.. కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇవన్నీ మూఢనమ్మకాలా? వాస్తవాలా? అన్న విషయం మాత్రం ఎవరీ క్లారిటీ ఉండదు.
 
కాకి అరుపుకు రామాయణంలో ఓ కథ ఉంది. ఆంజనేయుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు. 
 
అలాగే, కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయే అంత అపనమ్మకమూ ఉంది. కాకి శని వాహనం కాబట్టి.. కాకి తలకు తగిలితే శని దోషం జరుగుతుందని, యముడి రాకకి సంకేతమని భయపడతారు. కానీ.. దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అప్పటికీ భయంగా ఉంటే శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం చేసి, అభిషేకం చేయిస్తే దోషం పోతుంది. అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకుంటే సరిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోదరీసోదరుల అనుబంధానికి ప్రతీక 'రాఖీ'... రాఖీ ఎందుకు కట్టాలి?