Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్మసూక్షం అంటే ఏమిటి?

"ధర్మో రక్షతి రక్షిత" అను సూక్తి అందరికీ తెలిసిందే. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది.... అని దాని అర్థం. రక్షించడం అంటే కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర

ధర్మసూక్షం అంటే ఏమిటి?
, ఆదివారం, 22 జనవరి 2017 (11:53 IST)
"ధర్మో రక్షతి రక్షిత" అను సూక్తి అందరికీ తెలిసిందే. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది.... అని దాని అర్థం. రక్షించడం అంటే కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి. 
 
సత్యమునే పలుకుము. అసత్యము పలుకరాదు. అనే సూక్తి మనకు తెలిసిందే. ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణపురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు. అయితే ప్రాణ, విత్త, మానభంగమందు బొంకవచ్చు అని శుక్రాచార్యుని చేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు. అసలు ఏ మానవుడైనా ఈ మూడు సంధర్భాలలోనే అబద్ధ చెకప్పడానికి సిద్థపడతాడు. మరి ఈ సంగతి తెలియకనేనా పోతనంతటి వాడు, వ్యాస భగవానుని బాటలో నడిచి అలా పలికాడు?
 
ఆలస్యం, అమృతం విషం అనే సూక్తితో పాటు నిదానమే ప్రధానం అనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చూద్దాం. దండ కారణ్యంలో ఓ బుషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. సత్యవాది.. అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. ఒకరోజు ఆ బుషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణభయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందు నుంచి పరుగెత్తుకుని వెళ్ళింది. అది చూశాడు ఆ బుషి. ఓ వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు.
 
వేటగాడు వచ్చి ఇలా ఆవు వెళ్ళిందా అని అడిగితే అబద్ధం ఆడరాదు అనే ధర్మానికి కట్టుబడి వెళ్ళింది అని చెప్పాలి. అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు. ఒక్కక్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగుమీద నుంచి లేచి ఎడమవైపు అరుగుమీద కూర్చుని, శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోధన చేస్తున్నాడు. కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి అయ్యా. ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్ళిందా అని ఆ బుషిని అడిగాడు. గురువు గారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు.
 
ఆ బుషి వేటగాని వంక చూసి నాయనా ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్పుతున్నప్పటి నుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు అని బదులిచ్చాడు. వేటగాడు సంతృప్తి చెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. బుషి కుడివైపు అరుగు మీద కూర్చున్నప్పుడు ఆవు వెళ్ళింది సత్యం. అందుకే బుషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు అటు వెళ్ళలేదు. అది సత్యమే. అదే చెప్పాడు ఆ బుషి. బుషి అసత్యం ఆడలేదు. ఆవు రక్షించబడింది. ఇది కథ. మంచి పనిచేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని పాటించాలి. చెడు పని  చేసే విషయంలో నిధానమే ప్రధానం అనే సూక్తిని పాటించాలి. అదే ధర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగిన వాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాపై మిక్కిలి ప్రీతి కలవాని మీద నాకు కూడా మిక్కిలి ప్రీతి