Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళితే అంతా శుభమే.. ఎలా?

హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొబ్బరికాయకు ప్రాధాన్యత ఇస్తారు. ఏ చిన్న పూజకైనా టెంకాయ కొట్టకుండా చేయరు. రామాయణం, మహాభారతంలో కూడా టెంకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళితే అంతా శుభమే.. ఎలా?
, ఆదివారం, 1 అక్టోబరు 2017 (14:03 IST)
హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొబ్బరికాయకు ప్రాధాన్యత ఇస్తారు. ఏ చిన్న పూజకైనా టెంకాయ కొట్టకుండా చేయరు. రామాయణం, మహాభారతంలో కూడా టెంకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషిని తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు. గుండ్రటి ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలో ఉన్న నీళ్ళు రక్తం. గుజ్జు లేదా కొబ్బరి మనస్సును సూచిస్తాయి.
 
ఆలయాల్లో పూజారి కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. అలాగే పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను ఖచ్చితంగా కొడతారు. అయితే పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ చెడిపోతే అపచారమా? అనర్థమా? అని కంగారు పడుతూ ఉంటారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోష పడతాం. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. ఏమౌతుందో అని భయపడతాం. అయితే దేవుడికి కొట్టే కొబ్బరికాయ, కొట్టే విధానం రకరకాల పనులను తెలియజేస్తుంది.
 
కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళయిన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. అలాకాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వువస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకిగానీ, కొడుకుగానీ సంతానం లభిస్తుందని సూచన. 
 
టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు. ఈ అపోహను పూర్తిగా పక్కన పెట్టాలంటున్నారు జ్యోతిష్యులు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే కుళ్ళిపోయిన భాగాన్ని తీసేసి చేతులు, కాళ్ళు కడుక్కుని మళ్ళీ పూజ చేయాలి. 
 
వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడే కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం. భగవద్గీతతో చెప్పినట్లుగా పండుగ రోజు టెంకాయ, పువ్వు, పండు ఏదైనా తనకు సమర్పిస్తే స్వీకరిస్తాడట. అది ఎలా ఉందనేది ముఖ్యం కాదని, సమర్పించడమే ముఖ్యమట. అందుకే టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళితే భయపడాల్సిన అవసరం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 01-10-17