Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయం 3 నుంచి 6 గంటల మధ్యలో నిద్ర లేచి ఆ పనులు చేస్తే... ఫలితాలు అమోఘం

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్

Advertiesment
Brahma muhurtam
, ఆదివారం, 3 జులై 2016 (13:03 IST)
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది బ్రహ్మముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ మూహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ.
 
కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. నిజానికి తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆ ముహూర్తానికి ముందు బ్రహ్మ ముహూర్తం అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహ ప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తి భగవంతుని శక్తి తోడవుతుంది.
 
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వితన పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగులగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అసూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహాలు గానీ చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పొచ్చు.
 
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి విద్యార్థులకు ధ్యానం జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
 
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అలా తేలికంగా మారుతుంది. ఆధ్మాత్మిక ఆనందనాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారివారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపజేస్తారు. అందువల్ల ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్మాత్మికంగా సిద్థిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్మాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనాలు లేకపోయినా కనీసం మేలుకుని ఉండమంటారు మన పెద్దవాళ్ళు.
 
చల్లటి నీటితో తలస్నానం చేస్తే చాలా మంచిది. దీంతో మెదడు. కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణామాయం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది.
 
బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృథా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానకి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వల్ల మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. 
 
బ్రహ్మముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వల్ల సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసిన రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలువుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో రూ.24.5 లక్షల విలువైన రెండు కొత్త బస్సులు... తితిదేకి అప్పగించిన భక్తుడు