Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బులుపోతే పోయింది.. పుణ్యమన్నా మిగిలింది... నల్లకుబేరులను దేవుడికి దగ్గర చేసిన మోడీ

నల్లకుబేరులను బ్యాంకు ముందు లైన్‌లో నిలబడేలా చేశాను. నాకు భయపడి తమ డబ్బులు గంగపాలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నల్లకుబేరులు తమ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలి

Advertiesment
black money holders
, గురువారం, 24 నవంబరు 2016 (11:57 IST)
నల్లకుబేరులను బ్యాంకు ముందు లైన్‌లో నిలబడేలా చేశాను. నాకు భయపడి తమ డబ్బులు గంగపాలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నల్లకుబేరులు తమ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారని సంబరపడిపోతున్నారు మోడీ. కానీ మోడీ తీసుకున్న నిర్ణయం నల్లకుబేరులను దేవుడికి దగ్గర చేరుస్తోంది. 
 
వీలైనంత మేరకు దొంగదారుల్లో మార్చుకుంటున్న బడా బాబులు, మిగిలింది హుండీలో వేసి పుణ్యం కట్టుకుంటున్నారు. దానికి గత పద్నాలుగు రోజులుగా పెరిగిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయమే నిదర్శనం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు హుండీ ఆదాయం కోటి దాటిందంటే అబ్బా అనే వారు రాను రాను రోజుకు కోటిన్నర ఆదాయం తిరుమల హుండీ ద్వారా వచ్చేది. బ్రహ్మోత్సవాలు వంటి సమయాల్లో భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు అది రూ.2 కోట్ల రూపాయలకు చేరేది. కానీ గడిచిన పదిరోజులుగా తిరుమల హుండీ ఆదాయం రోజుకు 3 కోట్ల రూపాయలు తగ్గడం లేదు. ఒకవైపు చిల్లర లేక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుంటే మరోవైపు హుండీ ఆదాయం మాత్రం పెరిగిపోతుంది. 
 
దీనిని బట్టి చూస్తే బడాబాబులు తమ నోట్లను మార్చుకోవడానికి యేదారి లేక ఆ డబ్బులు శ్రీవారి సమర్పించుకుంటున్నారు. మోడీ ప్రకటన వెలువడిన రోజు నుంచి రెండున్నర కోటికి ఏ రోజు తగ్గలేదు హుండీ ఆదాయం. రోజుకు లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మాత్రం రూ.2 కోట్లు దాటుతుందని కానీ వస్తున్న భక్తుల సంఖ్య రూ.80 వేలకు మించడం లేదు. హుండీ ఆదాయం మాత్రం రూ.4 కోట్లకు చేరుతుంది. మోడీ నిర్ణయంతో ఎవరికి లాభనష్టాలు ఎలా ఉన్నా కలియుగ దేవుడు వేంకటేశ్వరుడికి మాత్రం కాసులు కురిపిస్తోంది. కుబేరుడిని వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్న ఆ వడ్డీకాసుల వాడు మోడీ పుణ్యమా అని అప్పులైనా తీర్చుకుంటాడేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్ర‌కీలాద్రిపై తొలిసారిగా కార్తీక దీపోత్స‌వం... అమ్మ‌వారికి ల‌క్ష‌ దీపార్చ‌న‌