Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబరు 9 నుంచి ఎన్టీవీ - భక్తి టీవీ కోటి దీపాల పండుగ.. సర్వం సిద్ధం

Koti Deepotsavam

డీవీ

, గురువారం, 7 నవంబరు 2024 (18:48 IST)
Koti Deepotsavam
ప్రతి ఏడాది ఎన్టీవీ - భక్తి టీవీ అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ కోటి దీపోత్సవంను 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. 
 
భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 17 రోజుల పాటు ఈ కోటి దీపోత్సవం మహా వైభవంగా జరగనుంది. నవంబర్ 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ కోటి దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. 
 
ప్రవచనంతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కల్యాణ మహోత్సవాలు, నీరాజనాలతో ఈ కోటి దీపోత్సవంలో భక్తులు పులకించిపోతారు. ఇక ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కోటి దీపోత్సవంలో ఓ మహాజ్వల ఘట్టం అనే చెప్పాలి.

ఈ కోటి దీపోత్సవంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవాతామూర్తులను చూసి భక్త కోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా కనువిందు చేయనుంది. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలను వెలిగించడం మాత్రమే కాదు కూర్చున్న చోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని కనులారా వీక్షించవచ్చు. 
 
శివలింగానికి స్వయంగా రుద్రాక్షలు, భస్మంతో అభిషేకం చేసే అవకాశాన్ని కూడా నిర్వాహకులే కల్పిస్తూ ఉండటం గమనార్హం. అలాగే దేవతల కల్యాణాన్ని చేయించినా, వీక్షించినా మహా పుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. 
 
అంతే కాదు ఒకే వేదికపై శివకేశవులను కోటి దీపాల మధ్య దర్శించుకునే మహా యోగమే కోటి దీపోత్సవం అని చెప్పవచ్చు. ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, వెలుగులీనే దీపాంతపులతో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. 
 
ఈ కోటి దీపోత్సవం నవంబర్ 9 నుంచి మొదలై నవంబర్ 25 వరకు జరగనుంది. ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఈ క్రతువు మొదలుకానుంది. దీనికి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి తర్వాత మహా స్కంధ షష్ఠి.. కుజ దోషాల కోసం..?