Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ ఉపకారం ఆశించకుండా సహాయం చేసేవారే గొప్పవారు

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది. ఆకలిగా ఉన్న వారికి ఏ ప్రతిఫలం ఆశించకుండా అన్నదానం చేయాలి. అలా చేయడం వల్ల మన జీవితానికి పరమార్ధం చేకూరుతుంది. దీనికి ఉదాహరణ ఇదే ఉదాహరణ. ఒక ఊరిలో ఒక పెద్దాయనకు తన జీవితంలో ఎన్నో శుభాలు జరిగ

ఏ ఉపకారం ఆశించకుండా సహాయం చేసేవారే గొప్పవారు
, బుధవారం, 2 మే 2018 (19:34 IST)
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది. ఆకలిగా ఉన్న వారికి  ఏ ప్రతిఫలం ఆశించకుండా అన్నదానం చేయాలి. అలా చేయడం వల్ల మన జీవితానికి పరమార్ధం చేకూరుతుంది. దీనికి ఉదాహరణ ఇదే ఉదాహరణ. ఒక ఊరిలో ఒక పెద్దాయనకు తన జీవితంలో ఎన్నో శుభాలు జరిగాయి. తన ఆనందాన్ని సన్నిహితులతో పంచుకోవాలని ఒక విందు ఏర్పాటు చేశాడు. స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులను విందుకు ఆహ్వానించాడు. రుచికరమైన వంటకాలు చేయించాడు. 
 
విందు జరిగే వేదికను అందంగా అలంకరణ చేయించాడు. విందుకు వస్తున్న అతిథులకు స్వయంగా స్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నాడు. సమయం మించిపోతున్నా... ఒక్క అతిథీ రాలేదు. వంటకాలు రుచి కోల్పోతాయని ఆ పెద్దాయనకు ఆలోచన కలిగింది. అతిథులు ఎందుకు రాలేదో వాకబు చేశాడు. వారంతా ఒక ప్రముఖుడి ఇంట్లో విందుకు వెళ్లారని తెలిసింది. వెంటనే ఆ పెద్దాయన తన కొడుకులను పిలిచాడు.
 
మీరు వీధిలోకి వెళ్లి యాచకులను, దివ్యాంగులను, శ్రమించలేని వృద్ధులను తీసుకురండి అని అన్నాడు. మరుక్షణంలో విందు జరిగే ప్రాంగణమంతా  నిండిపోయింది. అంతా తృప్తిగా భోజనం చేశారు. పెద్దాయనకు చాలా ఆనందం కలిగింది. తన ఇంట్లో మరో శుభం జరిగిందని సంతోషించాడు. విందుకు ఏమి లేనివారిని, పేదలను, వికలాంగులను పిలిస్తే... వారు తిరిగి పిలవరు. ఏ ఉపకారం ఆశించకుండా సహాయం చేసేవారే గొప్పవారు. భగవంతుడు కూడా ఇలా చేసేవారినే ఇష్టపడతాడు. ఆకలితో అలమటించే వారికి భోజనం పెట్టడం ఎంత గొప్ప విందో... మాటల్లో చెప్పలేం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం వ్రతమాచరిస్తే.. బృహస్పతికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో?