Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5000 యేళ్ళ కిందట తిరుమలపై శ్రీనివాసుడి సాక్షాత్కారం.... శ్రీవారి మొదటి పేరు ఏంటో తెలుసా...?

తిరుమల వెంకన్న ఏడుకొండలపై సాక్షాత్కారం ఎప్పుడు ఇచ్చారంటే చాలామందికి ఈ విషయం తెలియదు. 5000 యేళ్ళ కిందట స్వామివారు స్వయం వ్యక్తమూర్తియై ఏడుకొండలపైకి ఎక్కారు. ఇది నిజంగా నిజం. మరో ప్రధానమైన విషయమేమిటంటే శ్రీవారి మొదటి పేరు సాలగ్రామ శిలామూర్తి. అప్పట్లో

Advertiesment
5000 యేళ్ళ కిందట తిరుమలపై శ్రీనివాసుడి సాక్షాత్కారం.... శ్రీవారి మొదటి పేరు ఏంటో తెలుసా...?
, గురువారం, 9 జూన్ 2016 (15:26 IST)
తిరుమల వెంకన్న ఏడుకొండలపై సాక్షాత్కారం ఎప్పుడు ఇచ్చారంటే చాలామందికి ఈ విషయం తెలియదు. 5000 యేళ్ళ కిందట స్వామివారు స్వయం వ్యక్తమూర్తియై ఏడుకొండలపైకి ఎక్కారు. ఇది నిజంగా నిజం. మరో ప్రధానమైన విషయమేమిటంటే శ్రీవారి మొదటి పేరు సాలగ్రామ శిలామూర్తి. అప్పట్లో శ్రీవారు ఈ పేరుతోనే పూజలందుకునేవారు. 
 
శ్రీనివాసుని మహిమను తెలుసుకున్న భక్తులు అప్పట్లోనే వందలాదిగా ఏడుకొండలకు తరలివచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు గోవిందుని దర్శించుకునే భక్తులు సంఖ్య లక్షల్లో ఉంటోంది. ప్రస్తుతం చాలామందికి స్వామివారి మొదటి పేరు తెలియదంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురాణాల్లో మాత్రమే స్వామివారు ఎన్ని యేళ్ల కిందట ఇక్కడకు వచ్చారన్న విషయం ఉంది. 
 
శ్రీనివాసునికి ఒక పేరు కాదు, ప్రపంచంలోనే ఏ దేవునికి లేని పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో ఆపద మ్రొక్కులవాడు, అడుగడుగు దండాల వాడు, కోరిన వరాల రాయుడు, కలియుగ వైకుంఠుడు, శ్రీమన్నారాయణుడు, వైకుంఠధారి, సర్వాంతర్యామి, నిత్య కళ్యాణ చక్రవర్తి, శేషాచలపతి, ఏడుకొండలవాడు, వేంకటాచలపతి, శ్రీనివాసుడు, శ్రీవారు, ఆనంద నిలయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వస్తుంటాయి. వీటిలో కొన్ని మాత్రమే మనకు తెలుసు.
 
శ్రీవారు సాక్షాత్కారం సమయంలో మహావిష్ణువుతో చెప్పారట. వైకుంఠాన్నయినా విడిచి వుంటాను గానీ భక్తులను ఎంతమాత్రం విడిచి వుండలేనన్న దృఢమైన సంకల్పాన్ని చెప్పారట. అలా శ్రీనివాసుడు లోకకళ్యాణం కోసం మాత్రమే భువికి దిగివచ్చి నిత్యం కళ్యాణ పరంపరలు గుప్పిస్తున్న నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతున్నాడు. 
 
నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా ఎప్పుడూ తిరుమలలో కళ్యాణాలు జరగడం, స్వామి సన్నిధిలో వివాహాలు చేసుకుంటుండడం ఇక్కడి ప్రత్యేకత. భక్తుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతినిత్యం గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగుతూనే ఉన్నాయి. మనం కూడా అందామా... గోవిందా... గోవిందా....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి సేవలో నారో రోహిత్... శ్రీవారి ఆదాయం రూ.3.03 కోట్లు