శ్రీవారి అభయహస్తాలు ఏం చెబుతాయో తెలుసా...!
దివ్యమంగళకరం శ్రీ వేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వేంకటేశ్వరుని తేజోమూర్తి కడురమ్యం. హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం.. సంసార సాగర సముత్తరణైక సేతో అన్నట్లుగా... కుడి
దివ్యమంగళకరం శ్రీ వేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వేంకటేశ్వరుని తేజోమూర్తి కడురమ్యం. హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం.. సంసార సాగర సముత్తరణైక సేతో అన్నట్లుగా... కుడి హస్తంతో తన పాదములను చూపుతూ వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతుమాత్రమే చేసే సులభంగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా ఎడమచేతితో నాభిక్రింద నుంచి ఊర్థ్య ముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయం చెయ్యమన్న సందేశముంది.
కుడి హస్తంతో నా పాదాలను శరణువేడితే ఎడమచేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ. శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది. కుడిపక్కగల నామమును సూర్యనాడిగా, ఎడమపక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యన గల నామమును బ్రహ్మనాడిగా చెబుతుంటారు. చక్రం ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.
జ్ఞానమును పొందమని జ్ఞాన చిహ్నంగా శంఖంను, మోక్ష చిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తత్వ భావం లేకుండా జ్ఞానమును పొంది తద్వారా కుండలినీ జాగృత మొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది. ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.