Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనపట్ల మనకు వ్యక్తిగత విశ్వాసం, నమ్మకం ఎంతవరకుండాలి?

Advertiesment
మనపట్ల మనకు వ్యక్తిగత విశ్వాసం, నమ్మకం ఎంతవరకుండాలి?
FILE
మనపట్ల మనకు వ్యక్తిగత విశ్వాసం, నమ్మకం ఎంతవరకుండాలి? వీలైనంత ఎక్కువగా ఉండాలి. చిన్నతనం నుంచి కూడా మనచుట్టూ వుండేవారు ఏవో సలహాలు, మన గురించి జడ్జిమెంట్లు ఇస్తూనే వుంటారు. అవన్నీ ఓ ఎత్తయితే.. ఎప్పటికప్పుడు చేసుకునే ఆత్మ పరిశీలన, వ్యక్తిగత తీర్పులు ఎవరికి వారు సర్దుకోవడానికి సహకరిస్తాయి. వ్యక్తిగత ఎదుగుదలకు సహకరిస్తాయి.

స్వయం వాగ్దానాలను పర్యవేక్షించుకుంటూ వాటిని అమలు పరుస్తూవుండాలి. దీనివల్ల లక్ష్య సాధన సులువు అవుతుంది. ఎవరో ఏదో అనుకుంటారనో, ఎటువంటి విమర్శలు, తీర్పులు వస్తాయని సంకోచం ఉండకూడదు.

ఉదయం లేస్తూనే ఎవరికి వారు ఏం చేయాలి, ఏం సాధించాలి అని ఆనాటి కార్యక్రమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. స్వయం వాగ్ధానాల్ని అమలుపరుచుకున్నప్పుడు ఆత్మస్థైర్యం ఇనుమడిస్తుంది.

మనని మనమే విశ్వసించుకోలేనప్పుడు ఇతరులలో ఎవరు మనల్ని నమ్ముతారన్న ఒక్క సూత్రాన్ని గుర్తుంచుకుని, దానిని ఎల్లవేళలా మననం చేసుకుంటుంటే జీవితంలో సగం విజయం సాధించినట్లే. ఓ వాగ్ధానం చేసుకుని దాన్ని నిలుపుకోలేనప్పుడు ఎప్పుడూ వెనుకంజకే దారితీస్తుంటాయి.

తప్పుచేసినప్పుడు ఎదుటివారి విమర్శల్ని తలుచుకోవడం వల్ల ఫలితముండదు. స్వయం క్షమార్పణలు అవసరం. అయితే ఆ తప్పు మరో మారు జరగకుండా జాగ్రత్త వహించాలి. ఎవరిపట్ల వారికి మంచి ఫీలింగ్స్ వున్నప్పుడు సాధ్యంకానిదీ ఏదీ వుండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి ఆకులను మజ్జిగతో కలిపి తాగితే బరువు తగ్గుతారట!