స్త్రీ-పురుషుడు.. ఆ కిటుకు ఏమిటో?
స్త్రీ ఈ లోకంలో లేకపోయుంటే అస్సలు డబ్బుకు విలువే ఉండదన్నాడు ఓ తత్వవేత్త. యుగాలు మారినా తరాలు మారినా స్త్రీ ఉన్నంతకాలం మగాడిని ఆకర్షిస్తూనే ఉంటుంది. చాలా మంది మహిళలు మగాళ్లను తమ కొంగుకు కట్టేసుకుంటారు.
స్త్రీ ఈ లోకంలో లేకపోయుంటే అస్సలు డబ్బుకు విలువే ఉండదన్నాడు ఓ తత్వవేత్త. యుగాలు మారినా తరాలు మారినా స్త్రీ ఉన్నంతకాలం మగాడిని ఆకర్షిస్తూనే ఉంటుంది. చాలా మంది మహిళలు మగాళ్లను తమ కొంగుకు కట్టేసుకుంటారు. ఎందుకు మగాడు అంతలా స్త్రీలకు బానిసైపోతుంటాడు? ఇందుకు చాలా మంది శృంగారం అనుకుంటారు. ఇది కాదు.
అసలు కారణాలు ఆమె సొగసు, సిగ్గు, సుకుమారం. ఇవే ఆడదానిలోని మగాడిని అత్యంతగా ఆకట్టుకునేవి. మగరాయుళ్లుగా ఫోజులిచ్చుకుంటూ పొగరుగా వ్యవహరించే ఆడవారిని మగాళ్ళు ఇష్టపడరు. స్త్రీ ప్రతి చర్యలో, నడకలో, మాటలో అన్నింటికన్నా ముఖ్యంగా దేహంలో కోమలత్వం ఉండాలి. అది అబ్బాయిలను అయస్కాంతంలా ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా ఆడదానికి సిగ్గు ఒక ఆభరణం. సిగ్గుపడని అమ్మాయిలను అబ్బాయిలు అస్సలు ఇష్టపడరు. వధువుకి పెళ్లి చూపుల్లో ప్రారంభమైన సిగ్గు, మూడు నిద్రలయ్యేదాకా ఉంటుందట. పడగ గది సిగ్గు వేరు, ఇతరులను పొగిడినపుడు పడే సిగ్గు వేరు. ప్రతి ఒక్క మగాడు తన భార్య కుందనపు బొమ్మలా ఉండాలని అనుకుంటాడు. అదే నిజమై ఆమె తనదనయిపుడు ఇక పురుషుడి సంతోషానికి అవధులే వుండవు.