Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యకు - ప్రేయసికి ఉన్న తేడా ఏంటి... వారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

Advertiesment
what is the difference between wife and lover
ఇటీవలి కాలంలో పురుషులు చెడు అలవాట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పెడధోరణి వివాహితులు, అవివాహితుల్లోనూ కనిపిస్తుంది. ఒక వివాహితుడు.. తనకు అందమైన భార్య ఉన్నప్పటికీ పక్కింటి పుల్లకూర కోసం అర్రులు చాస్తాడు. అంటే.. ప్రియురాలి కోసం వెంపర్లాడుతుంటాడు. అలాగే, ప్రియుడు తనకు నచ్చిన అమ్మాయి కోసం గాలిస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో భార్య, ప్రేయసికి మధ్య ఉన్న తేడాలను పరిశీలిస్తే... 
 
నిజానికి భార్యకు, ప్రేయసికి ఎంతో తేడా ఉంటుంది. మూడుముళ్ళ బంధంతో చెంతకు వచ్చేది భార్య. కట్టుకున్న భర్తను అమితంగా ప్రేమిస్తుంది. తన భర్త చేసే ప్రతి పనిని ప్రేమిస్తుంది. కానీ, ప్రేయసి మాత్రం ఇందుకు విరుద్ధం. పొగిడితేనే ఐ లవ్‌యూ చెపుతుంది. మరో యువతి వైపు పొరపాటున కన్నెత్తి చూస్తే ఐ హేట్‌ యూ అని చెప్పి వెళ్లిపోతుంది. 
 
పైగా ప్రేయసి ఖర్చుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ భార్య అలా కాదు.. ఖర్చు తగ్గించి వచ్చిన సంపాదనలో కొద్దిగా దాచిపెడుతుంది. ప్రియురాలి కోసం పురుషుడు.. ప్రతి రోజూ అందంగా ముస్తాబు కావాల్సి వుంటుంది. భార్యల విషయంలో తమ భర్తలను స్టైలీష్‌గా తయారుచేస్తారు.
 
కానీ, భార్య దగ్గర అందంగా కాదు అన్యోన్యంగా మెలిగితే సరిపోతుంది. భర్తకు నచ్చేవి చేసేది భార్య.. తనకు నచ్చేవి చేయించుకునేది ప్రేయసి. భార్య పనిని పంచుకుంటుంది.. ప్రియురాలు కోసం చేసే పనిని ఆపేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రియురాలు నవ్వించి ఏడిపిస్తుంది.. కానీ, భార్య మనం ఏడిస్తే.. తను కూడా కన్నీరుపెడుతుంది. ఇలా భార్య, ప్రేయసి మధ్య అనేక వ్యత్యాసాలను గుర్తించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu