సమయాన్ని చక్కగా నిర్వహించుకుంటే మంచి జీవితం గడపగలరు. ఎప్పటికప్పుడు ఒత్తిడిని తగ్గించుకునే వ్యాపకాల్లో నిమగ్నమైతే స్ట్రెస్ తప్పుతుంది.
* రోజుకి 7 గంటలు హాయిగా నిద్రపోవాలి. శరీర తత్వాన్ని బట్టి ఒక గంట పెంచుకున్నా, తగ్గించుకున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు.
* హడావుడి లేకుండా శుభ్రంగా స్నానం చేయటానికి, మాయిశ్చరైజింగ్ లాంటి వాటికీ రోజుకీ గంట కేటాయించాలి.
* కేవలం మీకోసం ఒక గంట ఎక్సర్సైజింగ్, డీప్ బ్రీతింగ్, మీకు పనికొచ్చే హాబీలకోసం ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.
* భోజనం కోసం తప్పకుండా ఒక గంట ఉపయోగించండి.
ఈ సమయాన్ని తీసేస్తే ఉద్యోగానికి, ఇతర పనులకీ 14 గంటలు మిగులుతాయి. ఈ టైమ్‌ని సద్వినియోగం చేసుకోవటానికి కొన్నింటిని పాటించండి.
* కొన్ని పనులు ఇతరులకు అప్పగించండి. మీ పనిలో ప్రాధాన్యతల నిర్ణయించుకోండి.
* సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని మెయింటైన్ చేయండి.
* పని మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకోండి.
* మీ పనుల్ని అడ్డుకునేలా ఎవరైనా వేరే ఏమైనా చేయమంటే కుదరదని చెప్పండి
* ఇతరుల్ని, వారి సమయాన్ని గౌరవించండి.