ఈ 30 మీ జీవితాన్ని మార్చేస్తాయంతే... చూడండి ఓసారి...
మనిషి జీవితంలో అభివృద్ధి సాధించాలంటే కొన్నింటిని తెలుసుకోవాలి. అలాంటివాటిలో కొన్ని ఇక్కడ చూడండి.
మనిషి జీవితంలో అభివృద్ధి సాధించాలంటే కొన్నింటిని తెలుసుకోవాలి. అలాంటివాటిలో కొన్ని ఇక్కడ చూడండి.
1. మాట్లాడేముందు వినండి. రాసే ముందు ఆలోచించండి. ఖర్చు చేయడానికి ముందు సంపాదించండి.
2. కొన్ని సమయాల్లో అధిక ఖర్చు తప్పదు. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకుని, సమర్థవంతంగా పొదుపు చేయాలి.
3. మంచి విషయాలను ఇతరులను చూసి నేర్చుకోండి.
4. చెడు సహవాసాలొద్దు.. మంచి స్నేహితులను పక్కనే పెట్టుకోండి
5. వ్యాధుల కంటే భయమే అనేకులను చంపేస్తుంది. అందుచేత భయాన్ని వీడండి.. ధైర్యంగా ముందుకెళ్లండి.
6. సమయ పాలన జీవితంలో ముఖ్యం. అనుకున్న సమయాని కంటే పావు గంట ముందుగానే వెళ్లడం నేర్చుకోండి.
7. చేసిన తప్పును అంగీకరించండి. అది పెద్దదో, చిన్నదో కావొచ్చు. పరిష్కరించుకోండి.
8. జీవితంలో నేర్చుకోవడమే అధికం. అనుభవమే అన్నీ నేర్పిస్తుంది.
9. జీవిత భాగస్వామిని మీకు తగ్గట్టు ఎంచుకోండి.
10. భాగస్వామితో అన్నీ విషయాలు పంచుకోండి. స్నేహితులుగా వారితో మెలగండి.
11. హడావుడిగా పనిచేయొద్దు.. సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వండి.
12. అందరినీ ప్రేమించండి. ఈర్ష్యా ద్వేషాలను పక్కనబెట్టండి.
13. మంచివారితో స్నేహం చేయండి.. మీరూ మంచి వారవుతారు.
14. కారణం లేని కోపం వద్దు. కోపాన్ని నిగ్రహించుకునేదెలాగో ఆలోచించండి.
15. ఇతరుల గురించి తెగ ఆలోచించడం కంటే వాళ్లింతేనని వదిలేయడం మంచిది.
16. ఎవరు చెప్పడం కరెక్ట్ అనేదానికంటే.. ఏది కరెక్టో ఆలోచించుకోవాలి.
17. వెయ్యి సార్లు ఆలోచించండి. ఒక్కసారి నిర్ణయం తీసుకోండి.
18. న్యాయం కోసం పోరాడండి. దాని గురించి ఇతరులతో ఎలాంటి భయం లేకుండా చర్చించండి.
19. అసత్యాలొద్దు. భాగస్వాముల వద్ద ఓపెన్‌గా ఉండండి.
20. సత్యం ఒంటరిగా ప్రయాణిస్తుంది. అసత్యానికే తోడు కావాలి.
21. బతకండి.. బతికించండి.
22. ఇతరులచే ఏమరుపాటు చెందననే ధీమా వద్దు.
23. ప్రపంచం ఓ రంగ స్థలమనే విషయాన్ని గమనించండి
24. చేసేందుకు ఎప్పుడు పని ఉండి తీరాల్సిందే. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.
25. ఇతరులతో ప్రేమ, స్నేహభావంతో మెలిగే వారే ఉత్సాహవంతులు.
26. విజయానికి సంబరపడొద్దు. విజయాని విర్రవీగకుండా ఉండే వ్యక్తే రెండోసారి గెలిచినట్లవుతాడు.
27. ఓటమి అనేది తదుపరి కార్యాన్ని శ్రద్ధతో చేయాలనే హెచ్చరిక మాత్రమే.
28. ఇతరులు మనల్ని ఓదార్చాలని భావించడం కంటే.. ఇతరులను మనం ఓదార్చే స్థాయికి ఎదగాలి.
29. కఠోర శ్రమకు సరైన పేరే సాధన.
30. అనుమానంతోనే పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అందుకని అనుమానమే జీవితం కాకూడదు.