Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫీసుకు గులాబీ, ఎరుపు, నారింజ రంగులు వేసుకోవద్దు..

ఆఫీసుకు ఏయే రంగుల్లో దుస్తులు ధరించాలి. ఏ రంగులు అనుకూలిస్తాయి..? ఏవి అనుకూలించవో ఒక్కసారి చూద్దాం.. ఆఫీసుల్లో మీరు ధరించే దుస్తుల రంగు.. సహోద్యోగుల మనస్థితిపై ప్రభావం చూపుతాయి. ఆఫీసుకు ఆకుపచ్చ రంగు ద

Advertiesment
ఆఫీసుకు గులాబీ, ఎరుపు, నారింజ రంగులు వేసుకోవద్దు..
, బుధవారం, 15 నవంబరు 2017 (11:21 IST)
ఆఫీసుకు ఏయే రంగుల్లో దుస్తులు ధరించాలి. ఏ రంగులు అనుకూలిస్తాయి..? ఏవి అనుకూలించవో ఒక్కసారి చూద్దాం.. ఆఫీసుల్లో మీరు ధరించే దుస్తుల రంగు.. సహోద్యోగుల మనస్థితిపై ప్రభావం చూపుతాయి. ఆఫీసుకు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా మీరు స్నేహపాత్రులనే సందేశం ఎదుటివారికి ఇచ్చినట్లవుతుంది. ఇంకా ఆఫీసు వాతావరణం ఆహ్లాదమవుతుంది. 
 
నలుపు అధికార దర్పానికి ప్రతీక. ఈ రంగు దుస్తులు అన్ని రకాల వేడుకలకు ధరించవచ్చు. కానీ ఎరుపు, గులాబీ, నారింజ రంగు దుస్తులు మాత్రం ఆఫీసుల్లో ధరించడాన్ని తగ్గిస్తే మంచిది. ఇవి కోపానికి కారణమవుతాయి. 
 
ఇక తెలుగు రంగు దుస్తులు ఆఫీసుకు ధరించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఈ దుస్తులు పరిపూర్ణత్వాన్ని ప్రతిఫలిస్తాయి. గోధుమ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభావంతులుగా ప్రదర్శితమవుతారు. 
 
గోధుమ రంగు దుస్తులు జ్ఞానానికి, పరిపక్వతకూ ప్రతీకలవుతాయి. నీలం రంగు దుస్తులు పనిచేసే చోట ఉత్సాహాన్ని నింపుతుంది. ఆహ్లాదకర వాతావరణానికి మెదడును మార్చుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు.. ఆరెంజ్ పీల్‌తో..