Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సక్సెస్ సూత్రాలు.. ఒక్కసారి వైఫల్యం ఎదురైతే..?

సక్సెస్ సూత్రాలు.. ఒక్కసారి వైఫల్యం ఎదురైతే..?
, సోమవారం, 22 డిశెంబరు 2014 (14:01 IST)
ఒక్కసారి వైఫల్యం ఎదురైతే చాలు.. దాన్ని తలచుకుని కుంగిపోతుంటారు కొందరు. కానీ విజయం సాధించాలంటే.. దాన్ని అధిగమించడమే సరైన పరిష్కారం అంటున్నారు.. సైకాలజిస్టులు. పొరపాటు జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకోవాలి. అంతే తప్ప ఒక్కసారి విఫలమైతే పదేపదే వైఫల్యం వస్తుందని భయపడకూడదు. ఆ లోపాలను గుర్తించాలి. వాటిని పాఠాలుగా మార్చుకోవాలి. 
 
వైఫల్యం ఎదురైనప్పుడు ఒత్తిడి సహజంగానే ఉంటుంది. అలాంటప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామాలు చేయండి. మన మనసులో ఉన్న అలజడి కొద్దిగా తగ్గుతుంది. తరువాత వాస్తవాలను ఆలోచించాలి. అయితే చాలామంది ఈ కోణంలో ఆలోచించకుండా ఒక్క వైఫల్యంతోనే జీవితం అయిపోయిందనుకుని మరింత కుంగిపోతారు. 
 
శాస్త్రవేత్తలు ఏదైనా ప్రయోగం చేసి, అది ఫలించనప్పుడు మరో విధంగా ప్రయత్నిస్తారు. విజయం సాధించేంత వరకూ పట్టుదలతో అలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వైఫల్యం ఎదురైనప్పుడూ ఇదే సూత్రాన్ని పాటించాలి. కొత్త మార్గాన్ని అనుసరించాలి. 
 
ఇలాంటి సమయంలో సాధ్యమైనంతవరకూ ఖాళీగా లేకుండా చూసుకోవాలి. నచ్చిన లేదా ఏదైనా కొత్త పనులు చేయాలి. దానివల్ల మానసికంగా కుంగిపోయే పరిస్థితి ఉండదు. 
 
కొన్నిసార్లు చుట్టూ ఉన్నవారు కూడా మరింత కుంగదీసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే మీకు సమస్య ఉన్నప్పుడు సాధ్యమైనంతవరకూ సానుకూల దృక్పథం ఉన్నవారి మధ్య గడిపేలా చూసుకోండి. ప్రతికూలంగా ఆలోచించడం మానేయండి. 

Share this Story:

Follow Webdunia telugu