Publish Date: Thu, 28 May 2015 (16:47 IST)
Updated Date: Thu, 28 May 2015 (16:52 IST)
చాలా మంది జంటలకు ఒకసారి సెక్స్‌లో పాల్గొన్నపుడు అమితమైన ఆనందం కలుగుతుంది. మరోమారు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతారు. దీనికి కారణం ఏంటి? అదే పడక గది, అదే బెడ్, అదే అంగం, అదే యోని. కానీ మరోమారు అసంతృప్తిగా కలగడానికి కారణమేంటి? ఇదే అంశంపై సెక్స్, మానసిక నిపుణులను సంప్రదిస్తే...
అందుకే సెక్స్ కోర్కెలను ప్రేమ, కామం, మోహం అంటూ రకరకాలుగా వర్ణిస్తారు. సెక్స్‌లో ఆనందం పొందడానికి కేవలం అంగాలే కాదు వాటిని మించిన మనస్సు ముఖ్యమనే విషయం ఇక్కడ గ్రహించాలి. కొన్ని రాత్రులు సాదాసీదాగా శృంగారంలో పాల్గొన్నా తృప్తి కలగవచ్చు. మరికొన్ని రాత్రులు ఎంతకీ కలగదు. దీనికి కారణం మనస్సు. ఆ మనస్సు ఉన్న పరిస్థితిని బట్టి సెక్స్‌లో పాల్గొనే తీరు మారుతుంది.
మనస్సులో కలిగిన కోరిక.. ఆ కోరికను తీర్చే ఓ భాగస్వామిపై ఉండే ఇష్టం... ఈ రెండు జతకూడితేనే సెక్స్‌లో అత్యంత ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ అనుభవమే మళ్లీమళ్లీ కావాలని అనిపిస్తుంది. అది అసాధ్యం కాదని చెప్పడానికి వీలులేదు. సాధ్యమే. అదుకు మీరు చేయాల్సిందల్లా మానసికంగా సంసిద్ధులై ఉండటమే. అపుడు ప్రతీ రాత్రి వసంత రాత్రిగా మారిపోవడం ఖాయం.