Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 లక్షల డబ్బు బహుమతి అంది... ఆ తర్వాత సెక్స్ కావాలా అని అడుగుతోంది...

Advertiesment
sex
ఇటీవల అకస్మాత్తుగా నా ఫోన్ నెంబరుకు ఓ స్త్రీ ఫోన్ చేసింది. నా ఫోన్ నెంబరుకు 25 లక్షల డబ్బులు బహుమతిగా వచ్చాయనీ, తను చెప్పిన చిరునామాకు వస్తే ఆ డబ్బులు ఇస్తానని చెప్పింది. నా ఫోన్ నెంబరుకు అంత డబ్బు బహుమతి ఎందుకు వస్తుందన్న సందేహంతో అనేక ప్రశ్నలు వేశాను. 
 
అలా మాట్లాడుతున్న సమయంలోనే ఆమె మరింత సన్నిహితమైన సంభాషణ మొదలుపెట్టింది. పెళ్లి గురించి ప్రశ్నలు వేసింది. వస్తే డబ్బుతో పాటు ఇద్దరం సెక్సులో కూడా ఎంజాయ్ చేయవచ్చంటూ ఆఫర్ చేసింది. కానీ నాకు భయమేసి వెళ్లలేదు. కానీ ఆమె రోజుమార్చి రోజు ఫోన్ చేస్తోంది. బహుమతి సంగతి గురించి మాట్లాడటం మానేసి సెక్స్ చేసుకుందాం రమ్మని అడుగుతోంది. నాకు ఆమె గొంతు వింటుంటే వెళ్లాలనిపిస్తోంది. కానీ భయంగానూ ఉంది. ఏం చేయాలో తోచడంలేదు...
 
ఇలా ఫోన్లలో డబ్బులు వచ్చాయనీ, మీ భార్యభర్తలు ఇరువురూ కలిసి వస్తే ఆ డబ్బులు ఇస్తామని ఇటీవల ఎక్కువమంది ఆశ చూపిస్తూ ఫోన్లు చేస్తున్నట్లు అక్కడక్కడ పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఐతే అవన్నీ ఫేక్ కాల్స్. ఇలాంటి ఫోన్ కాల్స్ మాటున వ్యభిచార వృత్తి కూడా సాగుతున్నట్లు కొన్నిచోట్ల బయటపడిన నిజం. కాబట్టి ఇలాంటి కాల్స్ చేసే అపరిచిత వ్యక్తులు వేసే వలలో పడవద్దు జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu