Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీనేజ్ పిల్లలు చాటుగా శృంగార సమాచారం చదువుతుంటే ఏం చేయాలి?

నాలుగు దశల జీవితంతో మానవుడి మనుగడ జరుగుతూ ఉంటుంది. బాల్యదశ, కౌమార దశ, యౌవన దశ, వృద్ధాప్యం అనే నాలుగు దశల్లో మనిషికి అత్యంత కీలకమైనవిగా కౌమార, యౌవన దశలు చెప్పబడ్డాయి. కౌమారంలో శరీరంలోని శృంగార సంబంధిత గ్రంధులు పనిచేయడం ప్రారంభమవుతుంది. దీంతో శృంగార సం

టీనేజ్ పిల్లలు చాటుగా శృంగార సమాచారం చదువుతుంటే ఏం చేయాలి?
, సోమవారం, 12 జూన్ 2017 (19:55 IST)
నాలుగు దశల జీవితంతో మానవుడి మనుగడ జరుగుతూ ఉంటుంది. బాల్యదశ, కౌమార దశ, యౌవన దశ, వృద్ధాప్యం అనే నాలుగు దశల్లో మనిషికి అత్యంత కీలకమైనవిగా కౌమార, యౌవన దశలు చెప్పబడ్డాయి. కౌమారంలో శరీరంలోని శృంగార సంబంధిత గ్రంధులు పనిచేయడం ప్రారంభమవుతుంది. దీంతో శృంగార సంబంధమైన కోర్కెలు మెల్లగా కలుగుతుంటాయి. అమ్మాయిల పట్ల అబ్బాయిలు, అబ్బాయిల పట్ల అమ్మాయిలు పరస్పరం ఆకర్షణ మొదలవుతుంది. 
 
యౌవన దశకు చేరుకునేసరికి శరీరంలో రేగే వాంఛలను తీర్చుకునేందుకు తహతహలాడుతుంటారు. ఇందుకోసం గోప్యంగా శృంగార సంబంధిత పుస్తకాలను చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ విషయాలను గోప్యంగా చదవడం ఇంట్లో చేయకుండా కొందరు ఆఫీసుల్లోనో, చదువుకునే విద్యాలయాల్లోనో చేస్తుంటారు. ఈ విషయాన్ని ఎవరైనా గమనిస్తే భయపడిపోతూ చటుక్కున పుస్తకాన్ని దాచేస్తారు. 
 
అయితే ఇటువంటి భేషజాలు పోవాల్సిన అవసరంలేదు. జీవితంలో సగభాగం దాంపత్య జీవితంతో ముడిపడి ఉంటుంది కనుక శృంగారం గురించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. 
 
యౌవన ప్రారంభంలో ఇలా సిగ్గుపడిపోతూ అలాంటి పుస్తకాలను చదివే యువతీయువకులు పెళ్లయిన తర్వాత కూడా వాటిని ధైర్యంగా చూడట్లేదని తెలుస్తోంది. శృంగార విజ్ఞానం కలిగి ఉండటం వల్ల దాంపత్య సమయంలో ఎటువంటి పద్ధతులను అవలంభించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నవి తెలుసుకోవచ్చు. ఇక పెళ్లి కాకుండానే అమ్మాయి శృంగార పుస్తకాలు చదవడాన్ని సీరియస్‌గా తీసుకునే కంటే ఆ వయసు వచ్చిన పిల్లలతో పరోక్షంగానైనా ఇలాంటి విషయాలను మెల్లగా అర్థమయ్యేట్లు చెప్పాలి. అలా చేస్తే వారు దాని గురించి అవగాహన పెంచుకుని వక్రమార్గాల్లో వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా ఉపయోగాలేంటో తెలుసా?