Publish Date: Thu, 27 Nov 2014 (17:25 IST)
Updated Date: Thu, 27 Nov 2014 (17:32 IST)
సాటి పురుషుడు ఇచ్చే సలహాల కంటే అమ్మాయిలు ఇచ్చే సలహాలను పాటించడానికి పురుషులు ఎక్కువగా ఇష్టపడతారని సైకాలజిస్టులు అంటున్నారు. ఒక్కసారి పురుషుడి కళ్లలోకి లోతుగా చూస్తే చాలు.. అప్పటి అతని మానసిక స్థితి స్పష్టంగా బయటపడుతుంది. పురుషుల్లో భావోద్వేగాలు తక్కువ. ఒకవేళ లోనైతే దాని నుంచి బయటపడటం కష్టం.
కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు. యవ్వనంలో ఆవేశం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆవేదన మాత్రమే తోడుంటుంది. అయితే భాగస్వాముల మద్దతుతో ముందుకెళ్తే.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు.
భాగస్వాముల మధ్య ఒడిదుడుకులు ఎదురైనా ఇద్దరూ ఏకమై వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలని వారు సూచిస్తున్నారు.