Publish Date: Thu, 11 Jun 2015 (18:33 IST)
Updated Date: Thu, 11 Jun 2015 (18:35 IST)
ఎన్ని కేరట్‌లైనా బంగారం బంగారమే. బంగారాన్ని అందమైన ఆభరణంగా మలిచినప్పుడే దానికి అందం, ఆకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే మనుషులు కూడా. సరైన నడత, నడవడిక వున్న మనిషిని బంగారం లాంటి మనిషి అంటుంటాం.
అయితే మనిషిని బంగారంలా మలుచుకోవాలంటే.. కొంత ఓపిక నేర్పు, వ్యవహార కౌశలం అవసరమవుతాయి. కొందరిలో బిందెడు బద్ధకం, చెంబుడు చాదస్తం, బారెడు నిర్లక్ష్యం, చారెడు చపలత్వం చెంచాడు పలుకులు వంటి అవలక్షణాలు కవిపించవచ్చు. ఆ మాటను నేరుగా చెప్పలేరు. ఈ అవలక్షణాలను భరించనూలేరు. ఏమైనా వారి తీరు మార్చవలసిందే. మార్చడానికి కొన్ని చిట్కాలు వుంటాయి.
అబ్బే.. నిజానికి ఈ చిట్కాలు అంత కష్టమైనవేం కావు. కాని జీవితంలో ఇప్పటికే ఒక దశకు వచ్చేశాక- మౌలికంగా మార్చడమో, అవలక్షణాలను సరిదిద్ది ఉన్నతుడిగా తీర్చిదిద్దడమో వీలుకాకపోవచ్చు. కనీసం చిన్న చిన్న అంశాల్లోనైనా జీవిత భాగస్వామి వైఖరి మారాలంటే.. ఇల్లుదిద్దుకోవడం, ఇంట్లో వాళ్ళని సరిదిద్దడం రెండూ అవసరమని గుర్తు చేయండి. జీవితంలోని ప్రతి అంశంలో నిర్మాణాత్మకంగా పనిచేయాలి. పరిశ్రమించాలి. ఫలితాలు సాధించాలి అంటూ చెప్పండి అప్పుడే వారిని సరిదిద్దుకోగలరని మానసిక నిపుణులు అంటున్నారు.