Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా సెక్రటరీని ప్రేమిస్తున్నా... కానీ ఆమె మరో ఇద్దరితో క్లోజ్ గా ఉంది... ఎఫైర్ ఉందేమో...?

Advertiesment
psychology
, బుధవారం, 29 అక్టోబరు 2014 (19:07 IST)
నా వయసు ఇపుడు 38 ఏళ్లు. గతంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. కొన్ని కారణాల వల్ల ఆమె నన్ను కాదని వెళ్లిపోయింది. ఆ తర్వాత నాకు స్త్రీలపై అయిష్టత ఏర్పడి నమ్మడం మానేశాను. ఇటీవల నా వద్ద ఓ అమ్మాయి చేరింది. ఆమె వయసు 25 ఏళ్లు. పెళ్లి కాలేదు. చాలా గౌరవప్రదంగా ఉంటుంది. అందువల్ల ఆమెను పర్సనల్ సెక్రటరీగా నియమించాను. 
 
ఇక అప్పట్నుంచి ఆమె తోటిదే ప్రపంచమయిపోయింది నాకు. నా లవ్ ఫెయిల్యూర్ ఆమెకు చెప్పాను. ఓదార్చింది. కానీ తన గురించి ఏమీ చెప్పలేదు. నాకు ఆమెను పెళ్లాడాలనుంది. ఐతే ఆమె మరో ఇద్దరితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఐతే వారికంటే నాతో ఇంకా చనువుగా ఉంటుంది. ఓసారి మంచి సలహా ఇచ్చినందుకు గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ కూడా చేసుకున్నాను. 

 
కానీ ఆమెలో ఎలాంటి ఫీలింగ్ కనబడటంలేదు. పెళ్లి ప్రస్తావన తెస్తే ఏమంటుందోనని సందేహంగా ఉంది. అలాగే వాళ్లిద్దరిలో ఎవరితోనైనా ఎఫైర్ సాగిస్తుందేమోనన్న డౌటూ ఉంది... ఏం చేయాలో అర్థం కావడంలేదు...
 
ఓ అమ్మాయితో మీ ప్రేమ ఇప్పటికే విఫలం కావడంతో మిగిలిన వారిని కూడా అనుమానంగా చూస్తున్నారు. ఇప్పటికే మీ వయసు 40కి చేరువైంది. ఆమె వయసు 25 అంటున్నారు. అసలామెకు మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందో లేదో తెలుసుకోండి. 
 
ఆమె పెళ్లి కాని యువతి. అలాగే నేటి సమాజంలో మాట్లాడకుండా కూర్చుని పనులు సాధించుకోవడం కష్టం. అది మీకు తెలిసిన విషయమే. మాట్లాడినంత మాత్రాన రిలేషన్ ఉన్నట్లు కాదు. ఒకవేళ అలాంటి అనుమానం ఉన్నట్లయితే ఆమెతో నేరుగా ఈ విషయం ప్రస్తావించండి. మనసులో ఎవరయినా ఉంటే చెప్పేస్తుంది. సమయాన్ని ఆలోచనలతో వృధా చేయవద్దు.

Share this Story:

Follow Webdunia telugu