Publish Date: Wed, 10 Dec 2014 (17:07 IST)
Updated Date: Wed, 10 Dec 2014 (17:10 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం మంచిది.
ఒకసారి చిన్నప్పటి స్నేహితులను గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్నవారితో ఫోన్ చేసి కబుర్లు చెప్పాలి. కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే మాత్రం స్లీపింగ్ టాబ్లెట్లను ఆశ్రయించవద్దు. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగండి.
రోజూ అరగంట నడవండి. యోగా చేయండి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగనివ్వాలి.