Publish Date: Wed, 28 May 2014 (18:17 IST)
Updated Date: Wed, 28 May 2014 (18:24 IST)
నైతిక నమ్మకాలతో కూడిన సామాజిక వ్యవహారశైలి, గర్వం, తప్పు జరిగినప్పుడు మెదడు స్పందిస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ స్పందనతో మనిషిలో ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ సంఘర్షణే మానసిక ఒత్తిడి అంటారు.
సామాజికంగా వ్యవహరించేటప్పుడు వివిధ నైతిక భావాలతో మొదట మెదడు సమాచార పరంగా చర్చలో పాల్గొంటుంది. మెదడులోని నాడీ మండల వ్యవస్థ వివిధ భావాలను విభజిస్తుంది. మనభావాలకు అనుగుణంగానే నడుచుకుంటుంది.
ఎక్కడైన విలువలకు వ్యతిరేకంగా ఉన్నట్లైతే వెంటనే గుర్తిస్తుంది. ఇతరుల సామాజిక ప్రవర్తన తన వ్యక్తిగత విలువలతో సరిపోకపోయినా, తప్పు జరిగినా, ఇతరుల ద్వారా కాస్తంత అవమానం జరిగినా మెదడు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.
అందుచేత తప్పు జరిగినప్పడు, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురికావడానికి మెదడు స్పందించడమే కారణం. కాబట్టి చిన్న విషయాలకే కోపపడటం వంటివి మానుకుంటే మెదడుకు కాసింత విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఆలోచన పెరుగుతుంది.
అలాగే ప్రతీ విషయాన్ని భూతద్దంతో చూసి బాధపడటం చేయకుండా.. సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగినట్లు మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.