Publish Date: Sat, 12 Dec 2015 (19:02 IST)
Updated Date: Sat, 12 Dec 2015 (19:05 IST)
నా వయస్సు 24 యేళ్లు. నేను కొన్ని రోజుల క్రితం ఇంటర్నెట్ సెంటర్‌కెళ్లి.. అశ్లీల చిత్రాలను చూశాను. అప్పటినుంచి తరచుగా చూడటం అలవాటైంది. రేపటి నుంచి చూడకూడదు అనుకుంటాను. కానీ మరుసటిరోజు ఉదయం నిద్రలేవగానే మనస్సు ఆ వైపు లాగేస్తోంది. ఒక్కో రోజు పగలంతా అలానే చూస్తుండిపోతున్నా... ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలా?
సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువకుల్లో అశ్లీల చిత్రాలు చూడాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు పోర్నోగ్రఫీ చూస్తుంటారు. అయితే, దానికోసమే వెంపర్లాడటం వేరు. ఇది కాస్త మోతాదుకు మించిన ప్రవర్తనే. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ మీ కాళ్ల మీద మీరు నిలబడటం అవసరం. స్వతంత్ర జీవనం కోసం, మంచి జీవితం కోసం అది తప్పనిసరి.
జీవితంలో పైకిరావాలన్న లక్ష్యంతో ముందుకుసాగినట్టయితే ఈ తరహా వ్యసనం నుంచి బయటపడగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం గానీ, ఉపాధిగానీ దొరికినట్టయితే పోర్నోగ్రఫీ అలవాటు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ రోజుకు ఆరేడు గంటలు పోర్నో చూడటం అనేది మీ సమయాన్ని వృథా చేయడమేగాక... కొన్ని మానసిక, శారీరక సమస్యలూ రావొచ్చు. అప్పటికీ ఈ వ్యసనం నుంచి బయటపడలేకుంటే కౌన్సెలింగ్ తీసుకోండి.