Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'భావప్రాప్తి' అంటే అనుభవంలో చూస్తే తప్ప 'అర్థంకాని బ్రహ్మరహస్యం'

'భావప్రాప్తి' అంటే అనుభవంలో చూస్తే తప్ప 'అర్థంకాని బ్రహ్మరహస్యం'
, బుధవారం, 27 మే 2015 (17:59 IST)
చాలా మంది భావప్రాప్తి అంటే ఏంటే ప్రశ్నలు సంధిస్తుంటారు. నిజానికి భావప్రాప్తి అంటే ఏంటో చాలా మందికి తెలియదు కూడా. దీన్ని మాటల్లో కూడా వర్ణించలేం. ఒకసారి అనుభవంలో చూస్తే తప్ప అర్థంకాని బ్రహ్మరహస్యంగా పేర్కొంటారు. దీని గురించి మరింత లోతుగా పరిశీలిస్తే...
 
 
అయితే, వీర్యస్ఖలనం లేదా యోనిద్రవోత్పాదనం అనేది జననాంగాల నుంచి ఒక విధమైన ద్రవం స్రవించడం. వీర్యస్ఖలనం లేదా యోనిద్రవోత్పాదన చర్యలో మస్తిష్కంలో ఉండే కొన్ని నాడీకేంద్రాలు, కండరాలు, తంత్రులు ఓ విస్ఫోటనంలా ఆ స్థితిని కలిగిస్తాయి. అలాగే, లయాత్మకంగా సాగే యోని సంకోచ, వ్యాకోచాలు ఇందుకు కారణభూతమవుతాయి. ఇది శృగారంలో పాల్గొనే మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. 
 
భావప్రాప్తి అనేది ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించాలి. అటు పిల్లలను కనడానికి, మరోవంక అత్యాసక్తికర ప్రక్రియగాను ఇది ప్రసిద్ధి. సెక్స్ పట్ల ఆసక్తి పెరిగిన స్త్రీపురుషులకు లైంగిక భావాలు శరీరమంతా ఆవరించుకుని, అవి జననాంగాలను చేరినపుడు పురుషలలో అంగస్తంభన, మహిళల్లో యోని ద్రవాలు ఊరడం వంటివి జరుగుతాయి. ఈ విధంగా ప్రకటితమైన మార్పులు అంటే ఉద్దీపనం ఉత్తేజానికి, ఉత్తేజం భావప్రాప్తికి బాటలు వేస్తాయి. 
 
ఈ భావప్రాప్తిని మూడు విధాలుగా సెక్సాలజిస్టులు విభజిస్తారు. వీటిలో ఒకటి క్లైటోరల్ ఆర్గాజమ్. రెండోది వెజైనల్ ఆర్గాజమ్, మూడోది బ్లెండెడ్ ఆర్గాజమ్. ఇవి ముమ్మాటికీ మస్తిష్కంలోనయ్యే ఒక 'అలౌకిక కాముకానుభూతి'. అంతేకానీ, 'జననాంగాల పరిమాణం, పరిణామం'ల ఆధారంగా నిర్ణయించేంది కాదు. 

Share this Story:

Follow Webdunia telugu